STOCKS

News


యమహా ‘ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ’లో కొత్త వెర్షన్‌

Friday 12th January 2018
auto-mobiles_main1515780755.png-13094

  • ధర రూ.86,042

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తాజాగా తన ‘ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.86,042. మెరుగైన బ్రేకింగ్‌ వ్యవస్థ, మంచి పనితీరు సామర్థ్యంతో ఈ బైక్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందులో 149 సీసీ, ఎయిర్‌ కూల్డ్‌, 4 స్ట్రోక్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది. 220 ఎంఎం హైడ్రాలిక్‌ సింగిల్‌ రియర్‌ డిస్క్‌ బ్రేక్‌, 282 ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ల సాయంతో బైక్‌ను బాగా కంట్రోల్‌ చేయవచ్చని, వాహన స్థిరత్వం కూడా పెరుగుతుందని తెలిపింది. ‘ఎఫ్‌జెడ్‌ సిరీస్‌ను పదేళ్ల క్రితం భారత మార్కెట్‌లో ఆవిష్కరించాం. అప్పటి నుంచి చూస్తే ఇది 10 లక్షలకుపైగా కస్టమర్లను దక్కించుకుంది. తాజా కొత్త వెర్షన్‌తో ఎఫ్‌జెడ్‌ సిరీస్‌ పాపులారిటీ మరింత పెరుగుతుంది’ అని యమహా మోటార్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) రాయ్‌ కురియన్‌ తెలిపారు. 



You may be interested

‘అపోలో మైక్రో’ 248 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

Friday 12th January 2018

 శుక్రవారం ముగిసిన ఐపీఓ  ఈ నెల 22న లిస్టింగ్‌! న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 248 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. రక్షణ, విమానయాన రంగాలకు హార్డ్‌వేర్‌ సొల్యూషన్లనందించే ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 10న మొదలై శుక్రవారం ముగిసింది. రూ.270-275 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.156 కోట్లు సమీకరిస్తోంది. ఐపీఓ కింద జారీ చేస్తున్న 41,44,955

ఈ బడ్జెట్లో ఉద్యోగాలపైనే ఫోకస్‌

Friday 12th January 2018

 కార్వీ చైర్మన్‌ పార్థసారథి అంచనా  పన్ను మినహాయింపులుండొచ్చు  సీఏలు అజయ్‌ గాంధీ, విక్రమ్‌ ఆశాభావం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిబ్రవరి 1న ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఉద్యోగ అవకాశాల సృష్టికి ఉపయోగపడేదిగా ఉండవచ్చని కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి అంచనా వేశారు. జనాకర్షక బడ్జెట్‌ 2019లో ఉండవచ్చని, ఈ ఏడాది మాత్రం ఉద్యోగ సృష్టి చర్యలను చేపట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఉద్యోగ అవకాశాలనేవి కార్పొరేట్లకు పన్ను

Most from this category