STOCKS

News


మెరిసేదంతా బంగారం కానే కాదు...

Saturday 30th December 2017
news_main1514649945.png-12662

బిట్‌కాయిన్‌ పుణ్యమా అని క్రిప్టోకరెన్సీలపై ఇప్పుడు ఎంతో మందిలో ఆసక్తి నెలకొంది. బిట్‌ కాయిన్‌ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో వేరే క్రిప్టో కరెన్సీలను ఎంచుకునే వారూ ఉన్నారు. ఇక క్రిప్టోకరెన్సీల ఇనీషియల్‌ కాయిన్‌ ఆఫరింగ్‌కూడా పాపులర్‌ అవుతోంది. ఈ విషయాలపై ఓమ్నిసైన్స్‌ క్యాపిటల్‌ సీఈవో వికాస్‌గుప్తా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారిలా...

1636-1637 మధ్య కాలంలో నడిచిన తులిప్‌ బబుల్‌ ఓ టెక్ట్స్‌ బుక్‌ ఉదాహరణగా మారిపోయింది. ఈ తరహా పరిస్థితే బిట్‌కాయిన్‌ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. బిట్‌కాయిన్‌ వెనుకనున్న బ్లాక్‌చెయిన్‌ కాన్సెప్ట్‌ నిజానికి అత్యంత విలువైనదే. దీన్ని కరెన్సీ లావాదేవీలకు, బంగారం మాదిరిగా విలువ నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయినప్పటికీ ఇది బిట్‌కాయిన్‌కు విలువను చేకూర్చలేదు. అంతేకాదు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీల మాదిరిగా బ్లాక్‌ చెయిన్‌ విలువైనదే. కొందరు బిట్‌కాయిన్లను కరెన్సీ అంటున్నారు. కొందరు క్రిప్టోకరెన్సీ అంటున్నారు. సంప్రదాయ కరెన్సీలైన డాలర్‌, రూపాయి, పౌండ్‌ వంటి వాటికి ప్రత్యామ్నాయమనీ పేర్కొంటున్నారు. బిట్‌కాయిన్‌ విషయానికొస్తే వీటిని ఏ సెంట్రల్‌ బ్యాంకు కూడా ఇష్యూ చేయలేదు. కనుక వీటి విలువలో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. బిట్‌కాయిన్ల విడుదలపై పరిమితి ఉంది. గరిష్టంగా 21 మిలియన్లే. బంగారం సరఫరా తక్కువగా ఉండే మాదిరిగా దీన్ని డిజైన్‌ చేశారు. అందుకే దీన్ని డిజిటల్‌ గోల్డ్‌గా అభివర్ణిస్తున్నారు. 

ప్రస్తుతానికి 1,300కు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ప్రపంచమంతా కనిపిస్తున్న తాజా వెర్రి ఏమిటంటే ఇనీషియల్‌ కాయిన్‌ ఆఫరింగ్స్‌ (ఐసీవో). బిట్‌కాయిన్‌, ఎథీరియం, లైట్‌కాయిన్‌, మోనెరో కాకుండా ఇతర కరెన్సీల విషయంలో ఇనీషియల్‌ కాయిన్‌ ఆఫర్లు (ప్రారంభ విడుదల) కొనసాగుతున్నాయి. అడ్వాన్స్‌డ్‌ కోడింగ్‌ స్కిల్స్‌ ఉంటే మీరు కూడా ఓ కొత్త క్రిప్టోకరెన్సీని మొదలు పెట్టొచ్చు. క్రిప్టో కరెన్సీల సరఫరాలను పరిమితం చేయడం వల్ల, తొలి దశలోనే మైనర్లు అధిక కాయిన్లను రూపొందించడం జరుగుతుంది. దీంతో కాయిన్‌ ఇష్యూ ధరలు తక్కువగా ఉంటాయి. అపరిమిత సంఖ్యలో క్రిప్టోకరెన్సీలను విడుదల చేయడం వల్ల సరఫరా, డిమాండ్‌ మధ్య అంతరం ఉండదు. దీంతో మరింత మంది ఇందులో పాల్గొనడం వల్ల ప్రాచుర్యం పొందుతుంది. ప్రాచుర్యం వల్ల, కృత్రిమ డిమాండ్‌ వల్లే కరెన్సీ విలువ కూడా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. కానీ, మెరిసేదంతా బంగారం కానే కాదు. You may be interested

రిస్క్‌ తీసుకుంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌తో భారీ రాబడులు

Saturday 30th December 2017

రిస్క్‌ తీసుకోగలిగే సామర్థ్యం ఉన్న వారు ఇటీవలి కాలంలో నేరుగా స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్న ధోరణి కనిపిస్తోంది. అయితే, ఈ తరహా రిస్క్‌ తీసుకునే వారికి స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ భారీ రాబడులను ఇవ్వగలవని అంటున్నారు వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్రకుమార్‌. మధ్యకాలంలో పరిమిత రిస్క్‌తో దీర్ఘకాలంలో గణనీయమైన రాడులను ఫండ్స్‌ ఇస్తాయంటున్నారు. అయితే, మంచి ఫండ్స్‌, చెత్త ఫండ్స్‌ మధ్య తేడా తెలుసుకుని ఉండాలని

గ్యాస్‌ రంగానికి చెందిన ఈ షేర్లు కొనొచ్చు..!

Saturday 30th December 2017

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ టార్గెట్‌ ధర రూ.421 ప్రస్తుత ధర రూ.329 (28, డిసెంబర్‌ 2017) మహానగర్ గ్యాస్ లిమిటెడ్ టార్గెట్‌ ధర రూ.1,211 ప్రస్తుత ధర రూ.1097 (28, డిసెంబర్‌ 2017) పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ టార్గెట్‌ ధర రూ.304 ప్రస్తుత ధర రూ.251 (28, డిసెంబర్‌ 2017) హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన  రీసెర్చ్‌ రిపోర్ట్‌ కోసం ఈ దిగువన లింక్‌పై క్లిక్‌ చేయండి.  

Most from this category