STOCKS

News


స్టాక్స్‌లో సంపాదించలేకపోతున్నారా... మరెందుకు ఆలస్యం?

Monday 30th April 2018
personal-finance_main1525092673.png-16024

ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతమవుతోంది. 6 కోట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌, మ్యూచువల్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. స్టాక్స్‌లో పెట్టుబడులు ఇంకా ప్రారంభంలోనే ఉండగా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. అయితే, కొందరు ఈక్విటీల్లో స్వయంగా ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ, లాభాలు వచ్చినట్టే ఉంటాయి. కానీ, ఏదో ఒక రోజు ఆ లాభం సున్నా స్థాయికి వెళుతుంది. మరి ఈ క్రమంలో స్టాక్స్‌కు బదులు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవడం నయమంటున్నారు నిపుణులు.

గుంపులో...

ఇన్వెస్టర్లు ‘గుంపులో ఒకరు’ అనే తీరుతో ఉంటారు. తమ పెట్టుబడులకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ముఖ్యంగా మార్కెట్లు పెరుగుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు ఈ తరహా ధోరణి కనిపిస్తుంటుంది. మార్కెట్‌ పనితీరును ఎప్పటికప్పుడు ఎన్నో వర్తమాన అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో చాలా వరకు సాధారణ ఇన్వెస్టర్లు ఊహించలేనివే ఉంటాయి. మార్కెట్‌ పరిస్థితుల్లో మార్పులతో కంపెనీ ఫండమెంటల్స్‌ మారిపోవు. అందుకే తగిన శ్రద్ధతో ఇన్వెస్ట్‌ చేయాలి. గుంపులో ఒకరిగా కాదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ తగిన పరిశోధన తర్వాతే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అంతేకానీ, గుంపులో ఒకరిగా ఇన్వెస్ట్‌ చేయవు. మార్కెట్ల వోలటాలిటీ చూసి కంగారు పడి అమ్మేసి నష్టాలను మూటగట్టుకోవు. 

సిప్‌ సాధనం

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మార్కెట్ల ఆటుపోట్లను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. అదే సిస్‌ సాధనం. మార్కెట్లు పెరిగినప్పుడు, పడినప్పుడూ సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల, అధిక ధరలో, తక్కువ ధరలోనూ స్టాక్స్‌ కొనుగోలు చేసుకోవచ్చు. దాంతో సగటు కొనుగోలు ధర తగ్గి దీర్ఘకాలంలో అధిక లాభాలకు అవకాశం ఉంటుంది. అదే స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే వారికి ఈ అవకాశం తక్కువ. స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఆయా కంపెనీల మూలాలు, వ్యాపార గమనాల గురించి అంతగా తెలియకపోవడంతో అవి కరెక్షన్‌కు గురైనప్పుడు ప్యానిక్‌ అయిపోతారు. దాంతో నష్టాలకు అమ్మడం చేస్తుంటారు. ఫండ్స్‌ మేనేజర్లు ఆ విధమైన చర్యలకు దాదాపు దూరంగా ఉంటారు. సిప్‌ ద్వారా నెలకు రూ.500 నుంచి అయినా ఇన్వెస్ట్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నిపుణులైన మేనేజర్లు పెట్టుబడులను చూస్తుంటారు కనుక ఇన్వెస్టర్లు అన్ని కాలాల్లోనూ సిప్‌ ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్‌ చేయాలన్న మీమాంస అవసరం లేదు. 2017-18లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.1.7 లక్షల కోట్లు. సిప్‌ అకౌంట్లు 2.05 కోట్లకు పెరిగాయి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కంటే ఫండ్స్‌ను ఆశ్రయించడమే నయమన్న అవగాహన పెరుగుతుందనడానికి ఈ గణాంకాలు కూడా నిదర్శనమే. You may be interested

డీమార్ట్‌ ర్యాలీ ఎక్కడి వరకు...?

Monday 30th April 2018

ఈక్విటీ మార్కెట్లో వ్యాల్యూ ఇన్వెస్టర్‌గా పేరుబడిన రాధాకిషన్‌ దమానీ అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (డీమార్ట్‌) పేరుతో గతేడాది ఐపీవోకు వచ్చిన తర్వాత ఈ కంపెనీ షేరు అనూహ్యంగా పెరిగిపోయింది. ఆఫర్‌ ప్రైస్‌ రూ.299 అయితే, ప్రస్తుతం ఈ స్టాక్‌ ధర రూ.1,500 దరిదాపుల్లో ఉంది. ఐదు రెట్లు ర్యాలీ చేసింది. విశ్లేషకులను, ఫండ్‌ మేనేజర్లను, ఆర్థిక నిపుణులను ఈ ర్యాలీ ఆశ్చర్యపరించింది. మరి ఈ స్టాక్‌ గమనంపై వారి అభిప్రాయాలు

ఈ మూడూ.. అతుల్‌ సూరీ మెచ్చిన రంగాలు

Monday 30th April 2018

వినియోగం, కమోడిటీలు, రియల్టీ రంగాలు దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే రంగాలని, వీటిలో పెట్టుబడులను పరిశీలించవచ్చని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు అతుల్‌సూరీ అభిప్రాయపడ్డారు. ఈ మూడు రంగాలపై సూరీ విశ్లేషణ... 1. వినిమయం: ఆహార సంబంధిత రంగాల స్టాక్స్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కేవలం ఈ రంగాలే కాకుండా మొత్తం వినియోగరంగమే చాలా ఆకర్షణీయంగా మారింది. ఉదాహరణకు ద్విచక్రవాహనాల కంపెనీలు సైతం మంచి రాబడినందించే సత్తా ఉన్న షేర్లుగా మారాయి. అయితే ఫుడ్‌

Most from this category