STOCKS

News


విప్రో షేరును ఏం చేయొచ్చు?

Thursday 18th April 2019
news_main1555576437.png-25206

క్యు4లో మంచి లాభాలు ప్రకటించిన విప్రోపై బ్రోకరేజ్‌లు మిశ్రమంగా ఉన్నాయి.
1. నోమురా: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 270. క్యు4 ఫలితాల్లో  రెవెన్యూ గ్రోత్‌, మార్జిన్లు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. కానీ గ్రోత్‌ గైడెన్స్‌ అంచనాలు బలహీనంగా ఉన్నాయి. బైబ్యాక్‌ ముందు అనుకున్న విధంగానే ఉంది. కానీ గైడెన్స్‌ అంచనాలు భవిష్యత్‌ పేలవంగా ఉండొచ్చని సూచిస్తున్నాయి.
2. సిటీగ్రూప్‌: అమ్మొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 230. ఫలితాలు బాగున్నా, గైడెన్స్‌ నిరాశపరిచింది. మార్జిన్ల పరంగా మంచి పురోగతి చూపింది. కానీ రెవెన్యూ గతి తోటి సంస్థల కన్నా తక్కువగా ఉంది. తాజా బైబ్యాక్‌తో షేరు ధర మరీ పతనం కాకుండా నిలబడవచ్చు.
3. మోర్గాన్‌స్టాన్లీ: అండర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 255కు పెంచింది. ఎబిటా బాగున్నా, రెవెన్యూ బలహీనంగా ఉంది. ముఖ్యంగా గైడెన్స్‌ అత్యంత పేలవంగా ఉంది. 
4. డాయిష్‌ బ్యాంక్‌: హోల్డ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 270. సాధారణ ఫలితాలు ప్రకటించింది. ఆదాయం బాగున్నా, కోర్‌ ఎబిటా అంచనాలకు తక్కువగా ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐ రంగం మంచి పనితీరు కనబరిచినా, హెల్త్‌కేర్‌ రంగంలో బలహీనతలు కనిపించాయి. 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 34శాతం క్రాష్‌

Thursday 18th April 2019

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. నిధుల లేమితో అల్లాడిపోతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించాయి. దీంతో జెట్‌ తన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ నుంచి దిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ నిన్న ప్రకటించింది. ఈ

అరశాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 18th April 2019

ప్రభుత్వరంగ షేర్ల పతనంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ గురువారం ట్రేడింగ్‌లో 0.75శాతానికి పైగా నష్టపోయింది. నేడు బ్యాంకు నిఫ్టీ 30,656.50 వద్ద ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌ 3.5శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ 2శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), ఇడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్ 1.50శాతం క్షీణించాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ 1శాతం పతనమైంది. వాటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category