STOCKS

News


బ్యాంకు నిఫ్టీ భారీ ర్యాలీకి కారణాలేంటి?

Friday 15th March 2019
Markets_main1552645680.png-24630

ఫిబ్రవరి వరకు నేల చూపులు చూసిన బ్యాంకు నిఫ్టీ మార్చి ఆరంభం నుంచి జూలు విదిల్చింది. రోజురోజుకు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ కదం తొక్కుతోంది. బ్యాంకు నిఫ్టీ అండతో నిఫ్టీ సైతం ర్యాలీ మూడ్‌లోకి వచ్చింది. మార్చిలో బ్యాంకు నిఫ్టీ ఇంతవరకు దాదాపు 10 శాతం ర్యాలీ జరిపింది. పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ, బీఓబీ, ఆర్‌బీఎల్‌ తదితర పలు బ్యాంకు స్టాకులు 20 శాతం వరకు ర్యాలీ జరిపాయి. కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, యస్‌బ్యాంకు, యాక్సిస్‌లాంటి షేర్లు దాదాపు 10 శాతం దూసుకుపోయాయి. కేంద్రంలో మరోమారు మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు, దేశంలోకి పెరిగిన ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం, క్రెడిట్‌ గ్రోత్‌పై ఆశలు.. బ్యాంకు నిఫ్టీ పరుగులకు ఇంధనమిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంస్థాగత క్రెడిట్‌గ్రోత్‌ రికవరీ బాట పట్టి ఐదేళ్ల గరిష్ఠాలకు చేరింది. డిపాజిట్లలో వృద్ది సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ రెండు గ్రోత్‌లు బలంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎకానమీలో మెరుగుదల ఎక్కువైన కొద్దీ క్రెడిట్‌ గ్రోత్‌ మరింత ఊపంందుకుంటుందంటున్నారు. 
ఎన్నో మంచి శకునాలు
మరోవైపు డిపాజిట్లలో ప్రైవేట్‌ బ్యాంకుల వాటా ఇటీవల కాలంలో 19 నుంచి 27 శాతానికి పెరిగింది. కాసా వాటా సైతం 22 నుంచి 29 శాతానికి పెరిగింది. ఇంకోపక్క జన్‌ధన్‌ ఖాతాలతో పీఎస్‌యూ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. ఈ పరిణామాలు బ్యాంకు స్టాకులపై మక్కువ పెంచుతున్నాయి. ఇందుకుతగ్గట్లే గతంలో కొత్త బ్యాంకు లైసెన్సులకు ఎక్కువ సమయం తీసుకునే ఆర్‌బీఐ కేవలం గత ఐదేళ్లలో 12 బ్యాంకింగ్‌లైసెన్సులిచ్చింది. ఈ కారణంగా పలు ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకులుగా మారుతున్నాయి. దీంతో వీటిలో రిస్కులు తగ్గుతున్నాయి. వీటిలో మంచి సంస్థలను సొంతం చేసుకునే క్రమంలో బ్యాంకింగ్‌ రంగంలో ఎంఅండ్‌ఏ యాక్టివిటీ పెరగనుందని అంచనా. మరోపక్క వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు తగిన నిధులు అందిస్తామని ఆర్‌బీఐ భరోసా ఇస్తోంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత గతంతో పోలిస్తే మెరుగుపడుతోందని ఎడెల్‌వీజ్‌ నివేదిక తెలిపింది. ఇవన్నీ ఇన్వెస్టర్లలో బ్యాంకు షేర్లపై మక్కువ పెంచుతున్నాయి. ఈ కారణంగానే మార్చి ఆరంభం నుంచి బ్యాంకు నిఫ్టీ అద్భుత ప్రదర్శన జరుపుతోంది. You may be interested

వారమంతా లాభాలే

Friday 15th March 2019

38000పైన ముగిసిన సెన్సెక్స్‌ 11400 పైన ముగిసిన నిఫ్టీ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కూడా లాభాలతో ముగిసింది. దీంతో సూచీలు ఈ వారమంతా లాభాల బాటలోనే సాగినట్లైంది. సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభంతో 38,024 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,427 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం మొత్తంలో సెన్సెక్స్‌ సూచీ 1352 పాయింట్లను, నిఫ్టీ 391 పాయింట్లను ఆర్జించాయి. విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు

38000 పైన సెన్సెక్స్‌

Friday 15th March 2019

దేశీయ మార్కెట్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం, డాలర్‌ మారకంలో రూపాయి వరుసుగా ఐదో రోజూ బలపడటం, ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ ర్యాలీ అండతో శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌-రూపీ

Most from this category