News


ఏడాది గరిష్ట స్థాయికి వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌

Friday 1st September 2017
Markets_main1504259156.png-7886

ముంబై:- ప్రముఖ ట్రాన్స్‌ఫోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్‌ కంపెనీ వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ శుక్రవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 7శాతం లాభపడి ఏడాది గరిష్టస్థాయిని తాకింది. వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌కు చెందిన 20 లక్షల ఈక్విటీ షేర్లను రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ రూ.339.99ల ధర వద్ద కొనుగోలు చేసింది. ఈ విక్రయ వ్యవహారంతో వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ నేటి బీఎస్‌ఈ ఇంట్రాడేలో 7శాతం లాభపడి రూ.362ల వద్ద ఏడాది గరిష్టస్థాయిని తాకింది. ప్రస్తుతం గం.3:00లకు నిన్నటి ముగింపు ధర(రూ.338)తో 4శాతం లాభపడి రూ.349ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.244.70లు, రూ.362గా ఉన్నాయి.







You may be interested

ఏడాది గరిష్టస్థాయికి శంకర బిల్డింగ్స్‌

Friday 1st September 2017

సికింద్రాబాద్‌లో కొత్త ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించిన నేఫథ్యంలో  శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో శుక్రవారం  కంపెనీ షేరు ధర  దాదాపు4 శాతం పెరిగి రూ. 1232 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,254 వరకూ జంప్‌చేసింది.దీంతో  కంపెనీ షేరు ఏడాది గరిష్టస్థాయిని తాకింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిటైల్‌ ఔట్‌లెట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సికింద్రాబాద్‌లో నెలకొల్పిన  ప్రాసెసింగ్ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభించినట్లు  శంకర

ఏడాదిలో 30 శాతం దాకా పెరిగే షేర్లు కావాలా ?

Friday 1st September 2017

ఎస్‌బిఐ క్యాప్‌, కోటక్‌, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు ఈ వారం కొన్ని స్టాకులపై కన్నేశాయి. తాజాగా ఐదు స్టాకుల్లో ఈ సంస్థలు కొత్త కొనుగోళ్లు చేశాయి. ఏడాదిలో ఈ షేర్లు దాదాపు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా. 1. బోడల్‌ కెమికల్స్‌: టార్గెట్‌: రూ. 215. ఎస్‌బిఐ క్యాప్‌సెక్యూరిటీస్‌ తాజాగా ఈ షేరును కొనుగోలు చేసింది. అంతర్జాతీయ కెమికల్‌ రంగంలో 73000 కోట్ల డాలర్ల సామ్రాజ్య నిర్మాణంపై

Most from this category