STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ భారీ హెచ్చుతగ్గులు

Tuesday 13th February 2018
Markets_main1518508699.png-13923

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను అనుకరిస్తూ సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. శివరాత్రి కారణంగా భారత్‌ మార్కెట్లను సెలవు అయినందున, బుధవారం ట్రేడింగ్‌ పునర్‌ప్రారంభం సందర్భంగా మార్కెట్‌ ఎలా వుండవచ్చన్న సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ కదలికల ద్వారా ఇన్వెస్టర్లు తెలుసుకోవడం సాధ్యపడుతుంది. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్ల మేర ఎగిసి 10,580 పాయింట్లస్థాయికి చేరింది. అటుతర్వాత మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి అమెరికా ఫ్యూచర్లు తగ్గుముఖం పట్టడంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా తగ్గి 10,480 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అంటే.. గరిష్టస్థాయి నుంచి 100 పాయింట్ల వరకూ పతనాన్ని చవిచూసింది. సోమవారం ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,540 పాయింట్ల సమీపంలో క్లోజయ్యింది. కాగా అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. అక్కడి ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును వేగవంతం చేస్తుందా...లేదా అనే అంశాన్ని ద్రవ్యోల్బణ గణాంకాలు నిర్దేశిస్తాయి. క్రితం వారం భారీగా పతనమైన అమెరికా మార్కెట్‌.. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో కొంతవరకూ నష్టాల్ని పూడ్చుకోగలిగింది. ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అమెరికా ఇండెక్స్‌ ఫ్యూచర్లు మంగళవారం తిరిగి తగ్గుముఖం పట్టాయి. 


 



You may be interested

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేస్తుంటే..దేశీయ ఫండ్స్‌ కొంటున్నాయ్‌ !

Tuesday 13th February 2018

ముంబై:- ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న అల్లకల్లోలం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నా, దేశీయ సంస్థలు (డీఐఐ)ల కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి ఏడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో డీఐఐలు రూ.5,419 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోళ్లు చేశాయి. ప్రపంచ మార్కె‍ట్లలో అమ్మకాల సునామీ, దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను (ఎల్‌టీసీజీ), ద్రవ్యలోటు భయాలతో గత ఏడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారత్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి భారీగా పతమనయ్యాయి. ఈ

ఈ మూడు షేర్లూ కొనొచ్చు

Tuesday 13th February 2018

సోమవారం నిఫ్టీ పాజిటివ్‌గా ముగిసింది. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్‌ నెలల్లో క్షీణతను 100 డీఎంఏ రేఖ నిలిపివేసినట్లే, ఇటీవల పతనం కూడా అదే రేఖవద్ద ఆగిపోవడం సానుకూలమని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అనలిస్ట్‌ అశిష్‌ అంటున్నారు. నిఫ్టీ 10,450పైన స్థిరపడితే 10,640 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంటుందని, అంతర్జాతీయ మార్కెట్ల మద్దతువుంటే ఈ ర్యాలీ 10,700–10740 పాయింట్ల వరకూ పెరగవచ్చని, 10450 పాయింట్ల మద్దతుపోతే మాత్రం 10,276

Most from this category