STOCKS

News


5:1 రేషియోలో యునైటెడ్ స్పిరిట్స్ షేరు విభజన

Saturday 14th April 2018
Markets_main1523699206.png-15516

  • షేరు ప్రస్తుత ధర రూ.3,483.65
  • త్వరలోనే వెల్లడికానున్న ఎక్స్‌-డేట్‌ 

ముంబై: లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు ధర వేల రూపాయిల నుంచి వందల రూపాయిల స్థాయికి విభజనకానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.3,483.65 (ఏప్రిల్‌ 13న) వద్ద ఉంది. ప్రస్తుతం రూ.10గా ఉన్న షేరు ముఖవిలువను రూ.2 (5:1 రేషియో)కు విభజించనున్నట్లు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. అయితే, ఇందుకు షేర్‌హోల్డర్ల అనుమతి లభించవలసి ఉందని శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత కంపెనీ బోర్డ్‌ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 548,000,000 ఈక్విటీ షేర్లు ఉండగా.. 5:1 రేషియోలో విభజన పూర్తయిన తరువాత వీటి సంఖ్య 2,740,000,000 వద్దకు చేరుకోనుందని తెలియజేసింది. ఇదే సమయంలో 7 శాతం నాన్‌ కుమిలేటీవ్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను రూ.100 నుంచి రూ.10కి విభజిస్తున్నట్లు వెల్లడించింది. ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ను పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషించాయి.



You may be interested

5:1 నిష్పత్తిలో షేర్ల విభజన

Saturday 14th April 2018

ప్రకటించిన యూనిటెడ్‌ స్పిరిట్‌ ముంబై:- లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేర్లను 1:5 నిష్పత్తిలో విభజించనుంది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ షేర్ల విభజన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రూ.10లు ముఖ విలువ కలిగిన షేరు ఇక నుంచి రూ.2 ముఖవిలువతో లభించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు చౌకగా షేర్లను అందించడం, షేర్ల ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ పెంచడంతో పాటు మార్కెట్లలో నిధుల ప్రవాహాన్ని పెంపొందించడానికి  షేర్లను విభజిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు

ఈ మూడు షేర్లలో ర్యాలీకి అవకాశం..!

Saturday 14th April 2018

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లకు వచ్చేవారం చాలా కీలకమని ఈక్విటీ99 డాట్‌ కామ్‌ ఫౌండర్‌ సుమిత్ బిల్గాయన్ అన్నారు. ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో కనిపించనుండగా.. సియాంట్‌, డీసీబీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై భారత్ మారుతి, 5పైసా క్యాపిటల్, క్రిసిల్, ముతూట్ క్యాపిటల్, టాటా స్పాంజ్ లాంటి మిడ్‌క్యాప్‌ కంపెనీల క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయన్నారు. గురువారం (ఏప్పిల్‌ 19న) నిఫ్టీ కంపెనీలలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌

Most from this category