STOCKS

News


ఇండియా ఈక్విటీలపై అండర్‌వెయిట్‌!

Wednesday 16th May 2018
Markets_main1526462337.png-16507

క్రెడిట్‌ సూసీ రేటింగ్‌
ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలో భారత ఈక్విటీలపై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ వెల్లడించింది. భారత ఈక్విటీ మార్కెట్ల ప్రీమియం గరిష్ఠస్థాయిలకు చేరిందని అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే ఈ సమయంలో ఎంఎస్‌సీఐ ఇండియా సూచీ మాత్రం పెద్దగా పతనం కాలేదని క్రెడిట్‌ సూసీ తెలిపింది. ఇతర సూచీలు దాదాపు 19 శాతం పతనం కాగా భారత్‌ సూచీ కేవలం 9.9 క్షీణించిందని తెలిపింది. దేశీయ ఈక్విటీల్లో ఒకపక్క బలహీన ఆర్‌ఓఈ, ఈపీఎస్‌ డౌన్‌గ్రేడ్‌ కనిపిస్తుండగా మరోపక్క ప్రీమియం(వాల్యూషన్లు) 64 శాతం పెరిగిందని, గత గరిష్ఠాలకు ఇది దాదాపు సమానమని బ్రోకరేజ్‌ సంస్థ రిసెర్చ్‌ అనలిస్టు శక్తి శివ చెప్పారు. దీంతో ఆసియా పసిఫిక్‌ ప్రాంత సూచీల్లో భారత్‌పై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపారు. ఓవర్‌ వాల్యూడ్‌ మార్కెట్లు సాధారణంగా ఎక్కువకాలం అదే స్థితిలో ఉంటాయని తెలిపారు. యూఎస్‌ చైనా వాణిజ్య యుద్దం  ముదరడం జరిగితే ఈ పరిస్థితి చూడొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక వాల్యూషన్లు, అల్ప ఈపీఎస్‌, పెరుగుతున్న కరెంట్‌ ఖాతాలోటు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల.. దేశ విత్త, వాణిజ్య లోట్లను మరింత పెంచుతాయని నివేదిక తెలిపింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్ల నుంచి నిధుల ఉపసంహరణకే ఎక్కువ ప్రాధానమిస్తారని, ఇక్కడ పొజిషన్లు వదిలించుకోవాలనే యత్నిస్తారని హెచ్చరించింది. ఈ ఏడాది ఇంత వరకు భారత సూచీలు దాదాపు 4 శాతం లాభపడ్డాయి. 



You may be interested

కనిష్టస్థాయి నుంచి కర్నాటక బ్యాంక్‌ జూమ్‌

Wednesday 16th May 2018

ఏడాది కనిష్టానికి షేరు ధర ఏడాది కనిష్టం నుంచి 12శాతం ర్యాలీ ముంబై:- ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన నేపథ్యంలో ప్రైవేటు రంగ కర్నాటక బ్యాంక్‌ షేరు కనిష్టస్థాయి నుంచి జోరుగా ర్యాలీ జరిపింది.  గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(క్యూ4)లో నష్టాలు నమోదు కావడంతో నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో షేరు 3.30శాతం నష్టపోయి రూ.107.30ల వద్ద ఏడాది కనిష్టస్థాయికి పతనమైంది. అయితే  మొండి బకాయిలకు కేటాయింపుల్ని పూర్తిచేసారన్న సానుకూల అంశంతో షేరు తిరిగి పుంజుకుంది.

హిందుస్తాన్ యూనిలీవర్‌ కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 16th May 2018

కంపెనీ: హిందుస్తాన్ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.1,575 (మే 16, 2018) టార్గెట్‌ ధర: రూ.1,615 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,575/974 హెచ్‌యూఎల్‌ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.1,351 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. హోమ్‌ కేర్‌ బిజినెస్‌ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌యూఎల్‌

Most from this category