STOCKS

News


రూ.8,000 కోట్లు దాటిన అన్‌క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్లు

Saturday 13th January 2018
news_main1515831144.png-13108

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు (ఈ సొమ్ము నాదీ అని ఎవ్వరూ క్లెయిమ్ చేయనటు వంటి మొత్తం) గడిచిన నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపైపోయాయి. 2016 డిసెంబర్‌ 31 నాటికి ఈ మొత్తం ఏకంగా రూ.8,864.6 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. దేశావ్యాప్తంగా మొత్తం 2.63 కోట్ల అకౌంట్లలో ఈ సొమ్ము ఉన్నట్లు వెల్లడించింది. ఒకవైపు బ్యాంకులు కేవైసీ ఫామ్‌లను తీసుకోవాలని, ఎవరి సొమ్ము ఎంత ఉందనే విషయంపై విస్తృతంగా పరిశోధనలు జరగాలని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ.. 2012 నుంచి 2016 మధ్యకాలంలో ఈ తరహా డిపాజిట్లు, ఖాతాల సంఖ్య ఏకంగా రెట్టింపు కావడం విశేషం. ఎందుకంటే, వీరి ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలను ఆయా బ్యాంకుల వెబ్‌సైట్‌లలో ఉంచాలని ఆర్బీఐ ఇదివరకే సూచించింది. అయినప్పటికీ.. గడిచిన నాలుగేళ్ల కిందట రూ.3,598 కోట్లుగా ఉన్న అన్‌క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్ మొత్తం ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.8,864.6 కోట్లకు చేరుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.1,036 కోట్లు ఉండగా.. 47 లక్షల ఖాతాలు ఇన్‌యాక్టీవ్‌గా ఉన్నాయని, వీటిలోని సొమ్మును ఎవరూ క్లెయిమ్‌ చేయలేదని ఆర్బీఐ తెలిపింది. కెనరా బ్యాంకులోని 47 లక్షల ఖాతాల్లో రూ.995 కోట్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోని 23 లక్షల ఖాతాలు ఇన్‌యాక్టీవ్‌గా ఉండగా.. ఈ బ్యాంకులో రూ.829 కోట్లు అన్‌క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్ ఉన్నట్లు తెలిపింది. ఖాతాల్లోని సొమ్ము మాదే అని ఎవరూ ముందుకు రాకపోవడంతో బ్యాంకు శాఖలు వీటిని 10 ఏళ్లపాటు అలానే ఉంచి, ఆ తరువాత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తాయని ఆర్బీఐ వెల్లడించింది.



You may be interested

ఫార్మా క్యూ3పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా..!

Saturday 13th January 2018

ముంబై: ఫార్మా రంగ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఫలితాలు మిశ్రమంగా ఉండేందుకే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. అమెరికాలో నూతన ఉత్పత్తులను తక్కువ పోటీ వాతావరణంలో ప్రవేశపెడుతున్న సిప్లా, క్యాడిలా హెల్త్‌కేర్‌ ఫలితాలు బాగుండే అవకాశం ఉండగా.. అరబిందో ఫార్మా, అల్‌కెమ్‌ ల్యాబ్స్ ఫలితాలు బాగున్నాయి అనేలా ఉండనున్నాయని విశ్లేషిస్తోంది. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, దివీస్‌ ల్యాబ్‌ కంపెనీల ఫలితాలు పరవాలేదు అనేలా

నిధుల సమీకరణకు హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు ఆమోదం

Saturday 13th January 2018

ముంబై:- ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ రూ.13వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫ్రిపరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.11వేలకోట్లను, క్యూఐపీ ప్రక్రియ ద్వారా మరో రూ.2వేల కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజాలైన వేవర్లీ(జీఐసీ), ఓమేర్స్‌ కెనడా, సిల్వర్‌వ్యూ ఇన్వెస్ట్‌మెంట్స్‌(కేకేఆర్‌), కార్మిగ్నాక్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌, అజీం ప్రేమ్‌జీ ఫండ్స్‌ కంపెనీలకు 6.4కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రిపరెన్షియల్‌

Most from this category