STOCKS

News


రాబడి ఇచ్చే యూబీఎస్‌ బెట్స్‌

Wednesday 28th February 2018
Markets_main1519812526.png-14266

ప్రధాన మంత్రి నరేంద్ర మోది వచ్చే సాధారణ ఎన్నికలలో విజయం సాధిస్తారా లేదా అనే అంశం స్టాక్‌ మార్కెట్‌ పరంగా చాలా కీలకంగా మారిందని, ఇన్వెస్టర్ల వర్గం మాత్రం మోడీనే మళ్లీ ప్రధాని అవుతారని ఆశిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక‌ర్ యూబీఎస్ పేర్కొంది. గడిచిన నాలుగేళ్లలో ఎర్నింగ్స్‌ నిరాశపరిచినప్పటికీ.. మోది సంస్కరణలు మార్కెట్‌ను నిలబెట్టాయని వీరు భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం నిఫ్టీకి 10,600 పాయింట్ల వద్ద మేజర్‌ రెసిస్టెన్స్‌ ఉండగా.. ఆ తరువాత రెసిస్టెన్స్‌ 11,900 వద్ద ఉంది. సపోర్ట్‌ 8,800 వద్ద ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రకారం రిస్క్‌-రివార్డ్‌ రేషియో సానుకూలంగా లేదని, అయితే  ప్రధాన సూచీల కంటే ఇండివిడ్యువల్‌ షేర్ల కదలికలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన యూబీఎస్‌ టాప్‌ పెర్ఫార్మ్‌లుగా నిలిచిన 14 షేర్లను సూచించింది. ఇక్కడ నుంచి ఇవి 60 శాతం రాబడిని ఇచ్చే అవకాశం ఉందని అంచనావేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతి ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసీ, మదర్సన్ సుమి, టీసీఎస్, టైటాన్ షేర్లను సూచించింది. వీటితోపాటు ఆటో విడిభాగాలకు సంబంధించిన కంపెనీల షేర్లు, ఐటి సేవలు, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, ప్రోపర్టీ, టెలికాం, మీడియా రంగాలు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉందని వివరించింది.



You may be interested

10,500 దిగువన నిఫ్టీ ముగింపు

Wednesday 28th February 2018

మార్కెట్‌ను వెంటాడిన ఫెడ్‌ వడ్డీ రేట్ల భయాలు ముంబై:- ఫెడ్‌ వడ్డీ రేట్ల భయాలు దేశీ మార్కెట్‌ను మరోసారి నష్టాల్లోకి నెట్టాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రెట్లు పెంపుపై స్పష్టత రావడంతో  ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో మార్కెట్‌ వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసింది. బుధవారం సెన్సెక్స్ 162.35 పాయింట్లు కోల్పోయి 34184.04 వద్ద, నిఫ్టీ 61.45 పాయింట్లు క్షీణించిన 10492.85 వద్ద ముగిసింది. ఫెడ్‌ వడ్డీ రేట్ల భయాలకు

18 శాతం రాబడినిచ్చే ఛాన్స్‌ వున్న షేర్లివే..!

Wednesday 28th February 2018

ముంబై: డెరివేటివ్‌ డేటా ప్రకారం మార్కెట్‌ హైయ్యర్‌ లెవెల్స్‌ వద్ద అమ్మకాల ఒత్తిడి అలాగే కొనసాగుతూ ఉందని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ షితిజ్ గాంధీ వెల్లడించారు. టెక్నికల్‌ చార్టుల ప్రకారం నిఫ్టీకి 10,400 వద్ద సపోర్ట్‌ ఉండగా.. 10,600 పాయింట్ల వద్ద మేజర్‌ రెసిస్టెన్స్‌ ఉందని సూచించారు. ఇండివిడ్యువల్‌ షేర్ల విషయానికి వస్తే.. కనీసం 18 శాతం రాబడిని ఇవ్వగలిగిన 3 షేర్లను సిఫార్సు చేశారు. అవేంటంటే.. నెల్కో లిమిటెడ్

Most from this category