STOCKS

News


టీవీఎస్‌ మోటార్‌ లాభం 31 శాతం అప్‌...

Wednesday 16th May 2018
news_main1526487424.png-16518

  • రూ.700 కోట్ల పెట్టుబడులు
  • వాహనాల ధరలు పెరిగే అవకాశం ! 

న్యూఢిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌లో 31 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016-17)క్యూ4లో రూ.127 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.166 కోట్లకు పెరిగిందని టీవీఎస్‌ కంపెనీ పేర్కొంది. ఆదాయం రూ.3,076 కోట్ల నుంచి రూ.3,993 కోట్లకు ఎగసిందని కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్‌ కె.ఎన్‌. రాధాకృష్ణన్‌ చెప్పారు. 
అమ్మకాలు 32 శాతం అప్‌...
మొత్తం అమ్మకాలు 6.74 లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 8.89 లక్షలకు చేరాయని రాధాకృష్ణన్‌ చెప్పారు. మోటార్‌ బైక్‌ల అమ్మకాలు 2.15 లక్షల నుంచి 61 శాతం వృద్ధితో 3.46 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2.23 లక్షల నుంచి 26 శాతం వృద్ధితో 2.80 లక్షలకు పెరిగాయని తెలిపారు.  మొత్తం ఎగుమతులు 1.11 లక్షల నుంచి 45 శాతం పెరిగి 1.61 లక్షలకు ఎగిశాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు మధ్యంతర డివిడెండ్‌లు(మొత్తం డివిడెండ్‌ ఒక్కో షేర్‌కు రూ.3.30) ఇచ్చామని, తాజాగా ఎలాంటి డివిడెండ్‌ను ఇవ్వడం లేదని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016-17లో రూ.558 కోట్లుగా ఉన్న స్టాండోలోన్‌ లాభం గత ఆర్థిక సంవత్సరంలో 19 శాతం వృద్ధితో రూ.663 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు.  ఆదాయం రూ.13,190 కోట్ల నుంచి రూ.15,473 కోట్లకు పెరిగిందని తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, గత ఆర్థిక సంవత్సరం పెట్టుబడులతో పోల్చితే ఇది 55 శాతం అధికమని రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తులు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, కొత్త టెక్నాలజీ, భారత్‌ స్టేజ్‌ ఫోర్‌ అప్‌గ్రెడేషన్‌ నిమిత్తం ఈ పెట్టుబడులు వినియోగిస్తామని వివరించారు. కాగా ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయని, వాహనాల ధరలను పెంచే అవకాశాలున్నాయని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర​ కె. గోపాల దేశికన్‌ చెప్పారు. 
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ షేర్‌ 1.6 శాతం నష్టంతో రూ. 611 వద్ద ముగిసింది. 

 


 



You may be interested

ఎమ్మార్‌ ఎమ్‌జీఎఫ్‌ నష్టాలు రూ.724 కోట్లు

Wednesday 16th May 2018

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, ఎమ్మార్‌ ఎమ్‌జీఎఫ్‌  కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.724 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.  అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016-17)లో నికర నష్టాలు రూ.754 కోట్లుగా ఉన్నాయని ఎమ్మార్‌​ ఎమ్‌జీఎఫ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.954 కోట్ల నుంచి 43 శాతం వృద్ధితో రూ.1,364 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.1,708 కోట్ల నుంచి రూ.2,088 కోట్లకు ఎగిశాయని వివరించింది. గత ఆర్థిక

టాటా స్టీల్‌ లాభం రూ.14,688 కోట్లు 

Wednesday 16th May 2018

నష్టాల నుంచి లాభాల్లోకి న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.14,668 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బ్రిటన్‌ వ్యాపార పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన రూ.11,376 కోట్ల ఏకీకృత ఆదాయం ఈ స్థాయిలో లాభం పెరగడానికి కారణమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,168 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఈ మేరకు జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను బీఎస్‌ఈకి కంపెనీ

Most from this category