STOCKS

News


బ్రాడ్‌కామ్‌ డీల్‌కు ట్రంప్ బ్రేకులు..

Tuesday 13th March 2018
news_main1520960602.png-14635

  •  క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసే ప్రయత్నాలకు గండి
  •  జాతీయ భద్రతా కారణాల సాకు
  •  117 బిలియన్ డాలర్ల డీల్‌

వాషింగ్టన్‌: చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసేందుకు సింగపూర్‌ సంస్థ బ్రాడ్‌కామ్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఈ డీల్‌కు అనుమతివ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ క్వాల్‌కామ్‌ను గానీ బ్రాడ్‌కామ్ టేకోవర్ చేసిన పక్షంలో ఆ సంస్థ అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే విధమైన చర్యలు తీసుకోవచ్చంటూ విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయంటూ ట్రంప్ వివరించారు. వాటి ఆధారంగానే టేకోవర్ డీల్‌కు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. "ప్రతిపాదిత టేకోవర్ ఒప్పందాన్ని తక్షణమే శాశ్వతంగా పక్కన పెట్టాలి" అని బ్రాడ్‌కామ్‌, క్వాల్‌కామ్‌లను ట్రంప్ ఆదేశించారు. క్వాల్‌కామ్‌ను బ్రాడ్‌కామ్ టేకోవర్ చేయడం నిషిద్ధమని, అలాగే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో ట్రంప్ స్పష్టం చేశారు. 
    దాదాపు 117 బిలియన్ డాలర్ల ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో ఇంటెల్‌, శాంసంగ్ తర్వాత ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మైక్రో చిప్ తయారీ సంస్థ ఆవిర్భవించేది. అంతే కాకుండా టెక్నాలజీ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్‌గా కూడా నిల్చేది. అయితే, అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ గానీ ఆసియా సంస్థ బ్రాడ్‌కామ్‌ చేతుల్లోకి వెళ్లిపోయిన పక్షంలో .. మొబైల్ టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యానికి గండిపడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడి ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు బ్రాడ్‌కామ్ పేర్కొంది. క్వాల్‌కామ్‌ను తాము కొనుగోలు చేయడం వల్ల అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందన్న ఆందోళనలను ఖండించింది. 



You may be interested

ఈ నెల 16 నుంచి హెచ్‌ఏఎల్‌ ఐపీఓ

Tuesday 13th March 2018

20న ముగింపు  ధర శ్రేణి రూ.1,215-1,240 రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు రూ.25 డిస్కౌంట్‌  ఇష్యూ సైజ్‌ రూ.4,230 కోట్లు  ముంబై: హెలికాప్టర్లు, తేలిక రకం యుద్ధ విమానాలు  తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 16(ఈ శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ మహారత్న కంపెనీలో ప్రభుత్వం 20.20 శాతం వరకూ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది. ఈ ఐపీఓ ధర శ్రేణిని రూ.1,215-1,240గా

హీరో ప్యాషన్‌ ప్రో, ఎక్స్‌ప్రోలలో 2018 ఎడిషన్స్‌

Tuesday 13th March 2018

ప్రారంభ ధర రూ.53,189 న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’ తాజాగా 2018 ప్యాషన్‌ ప్రో, ప్యాషన్‌ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.53,189, రూ.54,189గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. 100-110 సీసీ మోటార్‌సైకిల్‌ విభాగంలో మార్కెట్‌ వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ బైక్స్‌ను ఆవిష్కరించింది. వీటిల్లో బీఎస్‌-4 నిబంధనలకు అనువైన 110 సీసీ ఇంజిన్లను అమర్చినట్లు

Most from this category