STOCKS

News


బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సాధించాం

Friday 23rd February 2018
news_main1519326248.png-14143

  • వీటితో 6,000 ఉద్యోగాలు వస్తాయి
  • కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులను సాధించామని, వీటితో తమ దేశంలో ఆరు వేల మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతాయని చెప్పారు. భారత వ్యాపార సమూహం సంపూర్ణ విశ్వాసానికి ఇది నిదర్శమన్నారు. కెనడాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎన్నో కంపెనీలు ఆసక్తితో ఉన్నాయని చెప్పారు. సీఐఐ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ట్రూడో పాల్గొని మాట్లాడారు. వ్యాపార నిర్వహణకు కెనడా ఉత్తమ ప్రదేశంగా పేర్కొన్నారు. భారత్‌, కెనడా తమ స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అందుకోసమే తాను భారత్‌లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. రెండు దేశాలు కలసి పనిచేయడం ద్వారా ఇరువురం ప్రయోజనాలు పొందొచ్చని సూచించారు. 400కుపైగా కెనడా కంపెనీలు భారత్‌లో పనిచేస్తున్నాయని, రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదన్నారు. ‘‘వైవిధ్యం అనేది ప్రగతికి కీలకం. ఆర్థికాభివృద్ధి అన్నది మన సమాజంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చాలి. మన మధ్య వాణిజ్యం, పెట్టుబడులు ఉండాలి. వీటితో ప్రయోజనం పొందొచ్చు’’ అని ట్రూడో చెప్పారు. కోల్డ్‌ చెయిన్‌, రిఫ్రిజిరేషన్‌లో రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌కౌర్‌ బాదల్‌ అన్నారు.  



You may be interested

65 దిగువకు రూపాయి

Friday 23rd February 2018

ముంబై: అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలపై మార్కెట్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గురువారం రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గింది. డాలర్‌తో పోలిస్తే 28 పైసలు క్షీణించి మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 65.04 వద్ద క్లోజయ్యింది. గతేడాది నవంబర్ 20 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. దేశీ స్టాక్ మార్కెట్స్ నుంచి పెట్టుబడులు తరలిపోతుండటం కూడా రూపాయి క్షీణతకు కారణమైంది. అమెరికాలో కొంత

విదేశాలకు పారిపోం: సింగ్‌  సోదరులు

Friday 23rd February 2018

సింగ్‌ సోదరుల ప్రకటన న్యూఢిల్లీ: బిలియనీర్‌ సింగ్‌ సోదరులు- మల్వీందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌లు విదేశాలకు పారిపోబోమని ఉద్ఘాటించారు. ఈ సింగ్‌ సోదరులిరువురు ఇటీవలనే ఫోర్టిస్‌, రెలిగేర్‌ కంపెనీల బోర్డ్‌ల నుంచి వైదొలిగారు.   ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ల్లో ఆర్థిక పరమైన అవకతకవలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, దైచీ శాంక్యో కంపెనీకి రూ.3,500 కోట్ల మేర ఆర్బిట్రేషన్‌ చెల్లింపుల వివాదం తదితర సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి

Most from this category