STOCKS

News


ఐఎస్‌డీ కాల్‌ టెర్మినేషన్ రేటు తగ్గించిన ట్రాయ్‌

Saturday 13th January 2018
news_main1515781904.png-13103

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ కాల్ టెర్మినేషన్ రేటును 53 పైసల నుంచి 30 పైసలకు తగ్గిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేటు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అధిక ఐఎస్‌డీ చార్జీల ప్రసక్తి లేకుండా వీవోఐపీ విధానంలో కొందరు అక్రమార్కులు ఇంటర్నేషనల్ కాల్స్‌ని భారత యూజర్లకు మళ్లిస్తుండటాన్ని నిరోధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలియజేసింది. అక్రమ ఐఎస్‌డీ కాల్స్ వల్ల దేశానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోవడంతో పాటు భద్రతాపరమైన రిస్కులు కూడా పొంచి ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కాల్స్‌ను చౌక చేసేలా కాల్ టెర్మినేషన్ చార్జీలను తగ్గించినట్లు పేర్కొంది. వేరే నెట్‌వర్క్‌ నుంచి వచ్చే కాల్స్‌ను తమ యూజర్లకు అందించేందుకు... ఇతర టెల్కోల నుంచి ఆపరేటర్లు వసూలు చేసే చార్జీలను కాల్ టెర్మినేషన్‌ చార్జీలుగా వ్యవహరిస్తారు.



You may be interested

పైకప్పు అదిరింది!

Saturday 13th January 2018

సాక్షి, హైదరాబాద్‌: డ్యూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్‌ సీలింగ్‌ అధికమవుతోంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్‌ డిజైన్‌తో పాటూ సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్‌ సీలింగ్‌ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరడడం, అలసిన మనసు, శరీరానికి స్వాంతన చేకూర్చడమే! సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరించుకోవచ్చు. దీంతో మనసుకు ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైకప్పు విశాలంగా ఉన్న భావన

బీఎస్‌ఈ ఐఎన్‌ఎక్స్‌లో ‘రికార్డ్‌’ టర్నోవర్‌

Saturday 13th January 2018

ముంబై: బీఎస్‌ఈ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం రూ.2,100 కోట్ల రికార్డ్‌ స్థాయి టర్నోవర్‌ నమోదయింది. ఈ ఎక్స్ఛేంజ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక టర్నోవర్ అని ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ (ఐఎన్‌ఎక్స్‌) తెలిపింది. ఆరంభం నుంచి చూస్తే తమ టర్నోవర్‌ 1,000 కోట్ల డాలర్లకు చేరినట్లు ఇండియా ఐఎన్‌ఎక్స్‌ ఎండీ, సీఈఓ వి. బాలసుబ్రహ్మాణ్యమ్‌ చెప్పారు. ఈ ఎక్స్ఛేంజ్‌ రోజుకు 22 గంటలు పనిచేస్తుందని, జపాన్‌ మార్కెట్‌ మొదలైనప్పుడు

Most from this category