STOCKS

News


ఈ మూడు షేర్లూ కొనొచ్చు

Tuesday 13th February 2018
Markets_main1518507052.png-13922

సోమవారం నిఫ్టీ పాజిటివ్‌గా ముగిసింది. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్‌ నెలల్లో క్షీణతను 100 డీఎంఏ రేఖ నిలిపివేసినట్లే, ఇటీవల పతనం కూడా అదే రేఖవద్ద ఆగిపోవడం సానుకూలమని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అనలిస్ట్‌ అశిష్‌ అంటున్నారు. నిఫ్టీ 10,450పైన స్థిరపడితే 10,640 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంటుందని, అంతర్జాతీయ మార్కెట్ల మద్దతువుంటే ఈ ర్యాలీ 10,700–10740 పాయింట్ల వరకూ పెరగవచ్చని, 10450 పాయింట్ల మద్దతుపోతే మాత్రం 10,276 పాయింట్ల వద్దకు తగ్గవచ్చని ఆయన విశ్లేషించారు. ఈ సందర్భంగా ఈ మూడు షేర్లనూ బుధవారం స్వల్పకాలిక లక్ష్యంతో కొనొచ్చని ఆయన సూచిస్తున్నారు. 

జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌
ప్రస్తుత ధర: రూ. 2027, స్టాప్‌లాస్‌: రూ.1950, టార్గెట్‌: రూ.2300

ఈ షేరు డెయిలీ చార్టుల్లో హయ్యర్‌టాప్, హయ్యర్‌ బాటమ్‌ను ఏర్పరుస్తూ, గత ఏడు నెలల నుంచి అప్‌ట్రెండ్‌లో వుంది. గత నెలల్లో రూ.1960 స్థాయి వద్ద బ్రేక్‌అవుట్‌ సాధించి రూ.2331 గరిష్టస్థాయిని చేరింది. అయితే ఇటీవలి క్షీణత తక్కువ ట్రేడింగ్‌ పరిమాణంతో జరగడం...బుల్స్‌ ఈ షేరును హోల్డ్‌ చేస్తున్నట్లు భావించవచ్చు. అలాగే గత గరిష్టస్థాయి అయిన రూ. 1960 సమీపంలో షేరు క్షీణత నిలిచిపోయి, అక్కడ్నుంచి వారంరోజులుగా స్వల్పశ్రేణిలో కన్సాలిడేట్‌ అవుతున్నది. ఈ కారణంగా 2,300 టార్గెట్‌ కోసం... రూ.1,990 వరకూ జరిగే తగ్గుదలను కొనుగోలుకు ఉపయోగించుకుని, రూ. 1950 స్టాప్‌లాస్‌తో ఈ షేరును హోల్డ్‌ చేయవచ్చు. 

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌
ప్రస్తుత ధర: రూ.1365, స్టాప్‌లాస్‌: రూ. 1,290, టార్గెట్‌: రూ. 1,500

ఏడాదిపాటు ఈ షేరు రూ. 1,240–800 శ్రేణి మధ్య కన్సాలిడేట్‌ అయ్యి, గతేడాది నవంబర్‌లో అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో బ్రేక్‌అవుట్‌ సాధించింది. ఈ బ్రేక్‌అవుట్‌స్థాయిపైనే మూడు నెలల నుంచి కన్సాలిడేట్‌ అయ్యి, సోమవారం రూ. 1,360 కొత్త గరిష్టస్థాయిని సాధించింది. ఈ షేరులో తాజా అప్‌ట్రెండ్‌కు సంకేతంగా దీనిని పరిగణించవచ్చు. అందుచేత ఈ షేరును ప్రస్తుతస్థాయిలో లేదా రూ. 1,340 వరకూ తగ్గినపుడు కొని, రూ. 1,290 దిగువన స్టాప్‌లాస్‌తో రూ. 1,500 టార్గెట్‌ కోసం వేచిచూడవచ్చు. 

అపోలో టైర్స్‌

ప్రస్తుత ధర: రూ. 275, స్టాప్‌లాస్‌: రూ. 260, టార్గెట్‌ : రూ. 310

గత నెలలో ఈ షేరు రూ. 289 గరిష్టస్థాయిని టచ్‌చేసిన తర్వాత అవరోధాన్ని ఎదుర్కొని రూ. 230 స్థాయికి తగ్గింది. ఆ స్థాయి వద్ద గట్టి మద్దతును పొంది పటిష్టంగా బౌన్స్‌ అయ్యి, ప్రస్తుతస్థాయికి చేరింది. ఈ బౌన్స్‌ అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో జరగడం...కొనుగోలు యాక్టివిటీని సూచిస్తున్నది. అందుచేత ఈ షేరును ప్రస్తుత స్థాయి లేదా రూ. 270వద్దకు తగ్గినపుడు కొనుగోలుచేసి రూ. 260 స్టాప్‌లాస్‌తో రూ. 310 టార్గెట్‌ కోసం హోల్డ్‌ చేయవచ్చు.  



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ భారీ హెచ్చుతగ్గులు

Tuesday 13th February 2018

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను అనుకరిస్తూ సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. శివరాత్రి కారణంగా భారత్‌ మార్కెట్లను సెలవు అయినందున, బుధవారం ట్రేడింగ్‌ పునర్‌ప్రారంభం సందర్భంగా మార్కెట్‌ ఎలా వుండవచ్చన్న సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ కదలికల ద్వారా ఇన్వెస్టర్లు తెలుసుకోవడం సాధ్యపడుతుంది. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్ల మేర ఎగిసి 10,580 పాయింట్లస్థాయికి చేరింది. అటుతర్వాత మధ్యాహ్నం

ఆసియా మార్కెట్లు జూమ్‌

Tuesday 13th February 2018

వారంరోజులపాటు భారీ పతనాన్ని చవిచూసిన అమెరికా, ఆసియా మార్కెట్లు మంగళవారం వరుసగా రెండోరోజు ర్యాలీ జరిపాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 400 పాయింట్లు (1.5 శాతం) పెరగ్గా, సింగపూర్‌ స్ట్రయిట్‌టైమ్స్, చైనా షాంఘై, కొరియా కోస్పి, తైవాన్‌ వెయిటెడ్‌ ఇండెక్స్‌లు 1 శాతంపైగా ఎగిసాయి. ట్రేడింగ్‌ తొలిదశలో ఈ సూచీల 2 శాతం వరకూ పెరిగినప్పటికీ, ముగింపులో లాభాల్ని కొంతమేరకు కోల్పోయాయి. జపాన్‌ నికాయ్‌ సూచీ లాభాల నుంచి నష్టాలకు

Most from this category