STOCKS

News


సాంక్టమ్‌ వెల్త్‌ నుంచి టెక్నికల్‌ రికమండేషన్లు

Tuesday 13th March 2018
Markets_main1520938919.png-14625

1. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1200. స్టాప్‌లాస్‌ రూ. 1060. ఇటీవలే సుదీర్ఘ కన్సాలిడేషన్‌ నుంచి బయటకు వచ్చింది. తాజాగా డైలీ చార్టుల్లో బుల్లిష్‌ ఫ్లాగ్‌ ఏర్పరిచింది. హయ్యర్‌ లోను ప్రతిరోజు ఏర్పరచడం కిందస్థాయిలో కొనుగోళ్లకు చిహ్నం. స్టొకాస్టిక్స్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. 
2. కేపీఐటీ టెక్‌: కొనొచ్చు.  టార్గెట్‌ రూ. 260. స్టాప్‌లాస్‌ రూ. 205. నెలవారీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ను ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ పాటర్న్‌కు పైస్థాయి వద్ద ట్రేడవుతోంది. త్వరలో మేజర్‌ పాజిటివ్‌ బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉంది. ఎంఏసీడీ, స్టొకాస్టిక్స్‌ ఇండికేటర్లు బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచాయి. కింద స్థాయిలో 50 రోజుల డీఎంఏ స్థాయి బలమైన మద్దతునిస్తోంది.
3. నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 65. స్టాప్‌లాస్‌ రూ. 50. ఐదువారాలుగా రూ. 47- 53 వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. సోమవారం ఈ రేంజ్‌ను పైస్థాయిలో బ్రేకవుట్‌ చేసింది. వాల్యూంలు కూడా ఆశావహంగా ఉన్నాయి. బోలింగర్‌ బ్యాండ్స్‌ పాజిటివ్‌ కదలికలను చూపుతోంది. 200 రోజుల డీఎంఏ స్థాయిని ఛేదించుకొని పైన స్థిరపడడం పాజిటివ్‌ అంశం.
4. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌:  కొనొచ్చు. స్టాప్‌లాస్‌ రూ. 2010. టార్గెట్‌ రూ. 2300. జనవరిలో ఆల్‌టైమ్‌ హైని చేరిన అనంతరం రూ. 1950 స్థాయిలకు పతనమైంది. తాజాగా 50రోజుల డీఎంఏ స్థాయి వద్ద మద్దతు ఏర్పరుచుకుంటోంది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
5. వోల్టాస్‌:  కొనొచ్చు. టార్గెట్‌ రూ. 730. స్టాప్‌లాస్‌ రూ. 639. డిసెంబర్‌లో గరిష్ఠాన్ని తాకిన అనంతరం రూ. 555 స్థాయికి దిగివచ్చింది. గత ర్యాలీకి ఇది 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి. ఇక్కడ డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. గత మూడు వారాలుగా పాజిటివ్‌ బ్రేకవుట్‌కు యత్నిస్తోంది. వాల్యూంలు కూడా అప్‌మూవ్‌కు సహకరించేలా ఉన్నాయి. 



You may be interested

రూ.5,000 సిప్‌తో కోటీశ్వరులు!

Tuesday 13th March 2018

ఇటీవలి మార్కెట్లో అస్థిరతలు చూసి ఆందోళన చెందుతున్నారా...? రికార్డు గరిష్టాలకు చేరిన తర్వాత నుంచి సూచీలు కరెక్షన్‌ బాట పట్టాయి. గత రెండు రోజుల్లో మార్కెట్లో కొంత కోలుకున్నాయి. అయినా, ఈ విధమైన ప్రయాణాలు చూసిన తర్వాత సహజంగానే కొత్త ఇన్వెస్టర్లలో ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చి పడుతున్న నిధులతో ఇటీవలి కాలంలో మన మార్కెట్లకు కొంత స్థిరత్వం వచ్చిన మాట నిజమే. ఫిబ్రవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను

సెన్సెక్స్‌ మైనస్‌...నిఫ్టీ ప్లస్‌

Tuesday 13th March 2018

5శాతం పతనమైన టీసీఎస్‌ లాభపడ్డ పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ముంబై:- దేశీయ స్టాక్ మార్కెట్‌ చివరిగంటలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై..చివరకు దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది.  బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 61.16 పాయింట్ల నష్టంతో 33,856 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.45 పాయింట్ల లాభంతో 10,426.85 వద్ద ముగిసింది.  పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఫార్మా, మీడియా, మెటల్‌ రంగాల షేర్లు లాభాల్లో ముగియగా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ షేర్లు

Most from this category