STOCKS

News


ఈ 30 స్టాకులను దిగ్గజాలు రికమండ్‌ చేస్తున్నాయ్‌!

Monday 16th April 2018
Markets_main1523872997.png-15546

దేశీయ మార్కెట్లు క్రమంగా గత రెండు నెలల గాయాలను మరిచి ముందుకు సాగేయత్నంలో ఉన్నాయి. నిఫ్టీ ప్రస్తుతం కీలక మద్దతు స్థాయిలకు పైనే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు వర్దమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే మంచి ప్రదర్శనే చూపుతాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ చెబుతోంది. ఏడాది చివరకు సెన్సెక్స్‌ 41,500పాయింట్లను తాకవచ్చని(బుల్‌రన్‌ కొనసాగితే) పేర్కొంది.(బేర్‌ కేస్‌లో 25వేల పాయింట్లకు దిగజారవచ్చని తెలిపింది.) ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ వాల్యూషన్ల పరంగా బాగున్నాయని అభిప్రాయపడింది. అందువల్ల ఈ ఏడాది పెట్టుబడుల కోసం పలు లార్జ్‌క్యాప్స్‌ను సిఫార్సు చేసింది.


మోర్గాన్‌ స్టాన్లీ రికమండ్‌ చేస్తున్న కంపెనీలు:
బజాజ్‌ ఆటో, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారత్‌ ఫైనాన్షియల్స్‌,  ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, డా. రెడ్డీస్‌, హావెల్స్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, ఆల్ట్రాటెక్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కమ్మిన్స్‌, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌.
మరో దిగ్గజ బ్రోకరేజ్‌ సంస్థ సిటి గ్రూప్‌ ఈ దఫా కంపెనీలు క్యు4లో 10 శాతం ఎర్నింగ్స్‌ వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేస్తోంది. ఏడాది చివరకు సెన్సెక్స్‌ 35,700 పాయింట్లకు చేరవచ్చని టార్గెట్‌గా పెట్టుకుంది. ఏడాది పొడుగునా మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటాయని తెలిపింది.


సిటీ గ్రూప్‌ లార్జ్‌క్యాప్‌ రికమండేషన్లు:
అంబుజా సిమెంట్‌, అరబిందో ఫార్మా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టాటామోటర్స్‌, ఐఓసీ.
మిడ్‌క్యాప్‌ సిఫార్సులు: అపోలో హాస్పిటల్స్‌, డీబీ కార్‌‍్ప, ఇమామీ, ఎక్సైడ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, జీఎస్‌పీఎల్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, వోల్టాస్‌.You may be interested

10-12 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌కు అవకాశం..!

Monday 16th April 2018

ముంబై: గతకొన్నేళ్ల నుంచి స్తబ్ధుగా కొనసాగుతూ వచ్చిన ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 2019 ఆర్థిక సంవత్సరంలో రెండెంకలకు చేరనుందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్, ఎకనామిస్ట్ అండ్ స్ట్రాటజిస్ట్ ధనన్జయ్ సిన్హా విశ్లేషించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10-12 శాతం ఉండవచ్చని అంచనాకట్టారు. 2017–18 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి (అక్టోబరు–డిసెంబరు) సంబంధించిన కాలంలో బేస్‌ ఎఫెక్ట్‌ అనుకూలంగా ఉండడం, డిమాండ్‌ రికవరీ సాధించడం, తమ

ఇన్ఫోసిస్‌కు ఫలితాల షాక్‌..!

Monday 16th April 2018

6 శాతం నష్టషోయిన షేర్లు నిమిషాల్లో రూ.15 వేల కోట్ల నష్టం ముంబై:- విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా త్రైమాసిక ఫలితాలను సాధించినప్పటికీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు సోమవారం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలో 6 శాతం నష్టపోయి రూ. 1099.00 ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. గత శుక్రవారం క్రితం ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉన్నప్పటికీ వృద్ధి రేటు, ఆపరేటింగ్ మార్జిన్

Most from this category