STOCKS

News


ఆటుపోట్ల మార్కెట్లో ఆదుకునే సిఫార్సులు!

Tuesday 13th March 2018
Markets_main1520935789.png-14621

కాంట్రా బెట్‌ రికమండేషన్లు
ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో ఎంచుకోవాల్సిన కొన్ని టాప్‌ కాంట్రా షేర్లను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
కోటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. ఇండో కౌంట్‌: యూఎస్‌లో బడా రిటైలర్ల డీస్టాకింగ్‌ ముగిసిపోనుండడం దేశీయ టెక్స్‌టైల్‌ ఎగుమతిదారులకు కలిసివచ్చే అంశం.  తదుపరి యూఎస్‌ రిటైలర్లు రీస్టాకింగ్‌ ఆరంభిస్తారు. దీంతో ఇండోకౌంట్‌లాంటి కంపెనీలకు మంచి లబ్ది చేకూరనుంది.
2. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌: ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చూపుతోంది. అయితే వచ్చే నాలుగేళ్లకు వెనక్కితిరిగి చూసే పనిలేకుండా కంపెనీ ఆర్డర్‌ బుక్‌ చాలా పటిష్ఠంగా ఉంది. కంపెనీ ఆర్‌ఓఈ బలంగా ఉంది. 
3. యూపీఎల్‌: అగ్రోకెమికల్‌ స్టాక్స్‌ ఇటీవల బాగా పతనం చెందాయి. వీటిలో యూపీఎల్‌ అతిపెద్ద కంపెనీ, ఆర్‌ఓఈ సైతం 20 శాతానికి పైనే ఉంది. తోటి కంపెనీలతో పోలిస్తే ఎర్నింగ్స్‌ ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా. 
4. డీబీ కార్‌‍్ప: మీడియా రంగంలో నమ్మదగిన కాంట్రా షేరు. ఎన్నికల వేళ సమీపిస్తుండడంతో ప్రింట్‌ మీడియా మరలా ఊపందుకోనుంది. ఎబిటా మార్జిన్లు గాడిన పడనున్నాయి.
5. టాటా మోటర్స్‌: ఆటోమొబైల్‌ రంగంలో ఎంచుకోదగిన కాంట్రాబెట్‌. గత కొన్ని త్రైమాసికాలుగా పేలవ ఫలితాలు చూపుతోంది. ఇకపై జేఎల్‌ఆర్‌ మార్జిన్లు గాడినపడతాయని అంచనా. 
6. ఎస్‌బీఐ: గత కొన్ని సెషన్లలో దాదాపు 21 శాతం పతనమైంది. ఈ దశలో దీన్ని మంచి కాంట్రా షేరుగా పరిగణించవచ్చు. లోన్‌గ్రోత్‌ మెరుగుపడడం, మార్జిన్లు క్రమంగా పెరగడం, కాసా వృద్ధి బలంగా ఉండడం.. కలిసివచ్చే అంశాలు.
జియోజిత్‌ సిఫార్సులు:
1. హెచ్‌సీఎల్‌ టెక్‌: సంవత్సరకాలంగా ప్రధాన సూచీతో పోలిస్తే తక్కువ వృద్ధి నమోదు చేసింది. కొత్త డీల్స్‌ కుదిరిన నేపథ్యంలో ఇకపై సత్తా చాటనుంది. డిజిటల్‌ వ్యాపార వాటా పెరుగుతుండడం కలిసివచ్చే అంశం.
2. ఆర్తి ఇండస్ట్రీస్‌: ఈ ఏడాది ఇంతవరకు కన్సాలిడేషన్‌ మూడ్‌లోనే ఉంది. బెంజిన్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీ. వైవిధ్యభరిత పోర్టుఫోలియో కంపెనీ సొంతం.
3. టొరెంట్‌ ఫార్మా: ఈ సంవత్సరం దాదాపు 6 శాతం పతనమైంది. యూనికెమ్‌ల్యాబ్‌ నుంచి బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ వ్యాపారం సొంతం చేసుకోవడంతో దేశీయ మార్కెట్లో స్థానం మరింత బలోపేతం కానుంది. యూఎస్‌ వ్యాపారంలో రికవరీ మరో కలిసివచ్చే అంశం. 
4. ఐడియా సెల్యులార్‌: 2018లో దాదాపు 27 శాతం క్షీణించింది. అయితే వొడాఫోన్‌తో విలీనం బాగా కలిసివచ్చే అంశం. 2018-19 సంవత్సరంలో ఈ డీల్‌ కార్యరూపం దాల్చవచ్చు. 
కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ సిఫార్సులు:
1. భన్సాలీ ఇంజనీరింగ్‌ పాలీమర్స్‌: గతేడాది దాదాపు 600 శాతం పెరిగిన ఈ షేరు ఈ సంవత్సరం ప్రాఫిట్‌బుకింగ్‌కు లోనైంది. దేశీయ వ్యాపారం మెరుగైన ప్రదర్శన చూపుతోంది. కంపెనీ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి.
2. ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌: ఏడాదిగా అంతంతమాత్రం ప్రదర్శన చూపుతోంది. అయితే ఐటీ స్టాకులన్నీ గాడిన పడుతున్న వేళ కంపెనీ సైతం మంచి జోరు చూపుతుందని అంచనా. You may be interested

ఆకర్షణీయ డివిడెండు కోసం 5 షేర్లు..!

Tuesday 13th March 2018

ముంబై: ప్రస్తుతం మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా కొనసాగుతున్నప్పటికీ పలు కంపెనీల షేర్లు మాత్రం ఆకర్షణీయంగానే ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి పలు ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందిన షేర్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైలైట్‌ అవుతాయని చెబుతున్న వీరు.. ఇందుకు ప్రధాన కారణం డివిడెండ్‌ అని అంటున్నారు. ప్రస్తుతం ఫిక్సిడ్‌ డిపాజిట్లపై బ్యాంకులు 6-7 శాతం వడ్డీ చెల్లిస్తుండగా, ఈ స్థాయిలో డివిడెండ్‌ ఈల్డ్‌ ఇవ్వడంలో పలు

ఆయిల్‌&గ్యాస్‌ షేర్ల హవా..!

Tuesday 13th March 2018

ముంబై:- ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు మంగవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ రంగానికి బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సూచీగా ఉన్న ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ నేడు ఒకటిన్నర శాతం వరకు లాభపడింది. ఇంట్రాడేలో 15,609 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదుచేసింది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) షేరు ధర 5.15 శాతం పెరిగింది. ఇంట్రాడేలో రూ.385.35 తాకింది. మధ్యాహ్నం 1:00 సమయానికి

Most from this category