STOCKS

News


బ్రోకరేజ్‌ల టాప్‌ టెన్‌ సిఫార్సులు..

Monday 16th April 2018
Markets_main1523857577.png-15526

స్వల్పకాలంలో మంచి రాబడులు ఇచ్చే పది స్టాక్‌ ఐడియాలను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి..
ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండేషన్స్‌
1. గ్లెన్‌మార్క్‌ ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 621. స్టాప్‌లాస్‌ రూ. 555. రెండేళ్లుగా నేలచూపులు చూస్తోంది. ఈ సుదీర్ఘ కరెక‌్షన్‌ రూ. 500 స్థాయిల వద్ద ముగింపునకు వచ్చింది. ఈ స్థాయి వద్ద ఆరేడువారాలుగా బలమైన మద్దతు కూడగట్టుకోంది. ఇటీవలే కన్సాలిడేషన్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చింది. వాల్యూంలు కూడా ర్యాలీకి అనుగుణంగా ఉన్నాయి.
2. ఇండియన్‌ హోటల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 149. స్టాప్‌లాస్‌ రూ. 132. మందగమనం దీని లక్షణం. అందుకే ట్రేడర్లు దీనిపై పెద్దగా మక్కువ చూపరు. అయితే తాజాగా డైలీ చార్టుల్లో బుల్లిష్‌క్యాండిల్‌ ఏర్పరిచింది. సమీప నిరోధం రూ.140ని దాటేందుకు రెడీగా ఉంది. 
3. హిందాల్కో: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 228. స్టాప్‌లాస్‌ రూ. 244. రెండు వారాలుగా మంచి రికవరీ చూపింది. అయితే వీక్లీ చార్టుల్లో ఇంకా బలహీనత కనిపిస్తోంది. తాజా రిలీఫ్‌ ర్యాలీ అనంతరం రూ.238 మద్దతు స్థాయికి మరోమారు చేరి పరీక్షిస్తోంది. ఇక్కడ నుంచి మరింత పతనం ఉండొచ్చని అంచనా.
5నాన్స్‌ డాట్‌ కామ్‌ రికమండేషన్లు
1. ఇండియా బుల్స్‌ వెంచర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 349. స్టాప్‌లాస్‌ రూ. 306. మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉన్నా ఈ స్టాకు మాత్రం మంచి కదలికలనే చూపుతోంది. ఇటీవలే పైస్థాయి నిరోధాన్ని మంచి వాల్యూంలతో బ్రేకవుట్‌ చేసి మరో ర్యాలీకి రెడీ అయింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి.
2. వక్రంగీ: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 123. స్టాప్‌లాస్‌ రూ. 145. ఇటీవల కీలక మద్దతు స్థాయి నుంచి రీబౌండ్‌ అయి మంచి రిలీఫ్‌ ర్యాలీ చూసింది. అయితే పైస్థాయిల్లో కొనసాగింపు చేయలేక మరోమారు పడిపోయింది. బోలింగర్‌ బ్యాండ్‌ నెగిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది.
3. దీపక్‌ ఫెర్టిలైజర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 392. స్టాప్‌లాస్‌ రూ. 360. గతవారం కన్సాలిడేషన్‌ ముగింపునకకు వచ్చింది. మూడునెలల స్థిరీకరణ అనంతరం కీలకమైన 200 రోజుల డీఎంఏ వద్ద పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. 
చార్ట్‌వ్యూ ఇండియా రికమండేషన్లు
1. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 587. స్టాప్‌లాస్‌ రూ. 525. ఏడు సెషన్ల స్థిరీకరణ అనంతరం మరో దఫా ర్యాలీకి సిద్ధమైంది. ఇండికేటర్లన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి.
ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు
1. డీ లింక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 126. స్టాప్‌లాస్‌ రూ. 102. బుల్లిష్‌ ఫ్లాగ్‌ ధోరణికి పైన మరో పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. వాల్యూంలు కూడా ట్రెండ్‌కు మద్దతుగా ఉన్నాయి.
2. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 205. స్టాప్‌లాస్‌ రూ. 166. వీక్లీ చార్టుల్లో రైజింగ్‌ పీక్‌ ధోరణి చూపుతూ పాజిటివ్‌గా ఉంది. డిసెంబర్‌ నుంచి కరెక‌్షన్‌కు గురై ఇటీవలే రీబౌండ్‌ చూపింది. కీలకమైన 52 వారాల ఈఎంఏ స్థాయి వద్ద బలమైన మద్దతుంది.
3. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. స్టాప్‌లాస్‌ రూ. 685. రెండునెలలుగా రూ. 728-859 వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. ఇందులో భాగంగా రూ. 728 వద్దకు వచ్చిన ప్రతిసారీ రీబౌండ్‌ అవుతూ అక్కడ బలమైన మద్దతు పొందింది. తాజాగా అధోముఖ వాలురేఖను ఛేదించి పాజిటివ్‌బ్రేకవుట్‌ ఇచ్చింది. You may be interested

హెచ్చుతగ్గుల్లో పసిడి..!

Monday 16th April 2018

ముంబై:- ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయంగా పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోంటున్నాయి. వాణిజ్యయుద్ధ భయాలు, అమెరికా సిరియాపై దాడులకు దిగడంతో గత వారం చివరిరోజైన శుక్రవారం (ఏప్రిల్‌ 13న) 10 డాలర్లు పెరిగి 1347.90 డాలర్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమ ప్రారంభంతో  ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌(31 గ్రాములు) 1,349.80 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 1342.80-1351.50 డాలర్ల మధ్య శ్రేణిలో

రూపాయికి సిరియా సెగ

Monday 16th April 2018

10 గంటల సమయానికి 65.39 వద్ద ట్రేడింగ్‌ భూగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఉదయం నష్టాలతో మొదలయ్యింది. ఫారెక్స్ మార్కెట్‌లో 9 గంటల 15 నిమిషాల సమయానికి రూపాయి విలువ 20 పైసలు కోల్పోయి 65.38 దగ్గర ప్రారంభమయ్యింది. శుక్రవారం ముగింపు 65.22 కాగా, ఈస్థాయి నుంచి 0.26 శాతం నష్టపోయి ట్రేడింగ్‌ ప్రారంభించింది. భారత కరెన్సీని పొటెన్షియల్‌ కరెన్సీ మ్యానిపులేటర్స్‌

Most from this category