News


‘‘షేర్ల’’ డాక్టర్‌ సలహాలు విందామా...

Monday 17th July 2017
Markets_main1500280503.png-5506

మార్కెట్లో లాభాల పంట పండిస్తున్న డా. విజయ్‌ మాలిక్‌
డా. స్టాక్‌గా వర్ణిస్తున్న వాల్యూ ఇన్వెస్టర్లు

మార్కెట్లో ఈ రోజు పెట్టుబడి పెట్టి రేపటికి భారీ లాభాలు రావాలని ఆశించి భంగపడేవాళ్లు డా. విజయ్‌మాలిక్‌ కథ తెలుసుకోవాలి. మల్టీబాగర్లను ఎంచుకునేందుకు విజయ్‌ ఉపయోగించే బాటమ్స్‌ అప్‌ విధానం ఆయనకు ఎంతో లాభాన్ని ఆర్జించిపెట్టింది. తన విధానానికి ఆయన ‘‘ పీస్‌ఫుల్‌ పెట్టుబడి’’ అని పేరుపెట్టుకున్నారు. పేరుకు తగ్గట్లే ఎటువంటి టెన్షన్లు, భయాలు లేకుండా ఏటా తన పెట్టుబడులపై 50 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. ఈయన విధానాలకు ఆకర్షితులై వాల్యూఇన్వెస్టర్‌ సంజయ్‌ బక్షి ఆయన్ను డా.స్టాక్‌ అని ముద్దుగా పిలుస్తున్నారు. ఓపికే ఆయన పెట్టుబడిలో కీలకాంశమని సంజయ్‌ అభిప్రాయపడుతున్నారు. టెన్షన్లు లేకుండా మంచి లాభాలు ఆర్జించేందుకు డా. స్టాక్‌ ఎంచుకున్న విధానాలు చాలా సులువైనవి.
ఈ అంశాలు కీలకం
- పోర్టుఫోలియోను విచ్చలవిడిగా వివిధ స్టాకులతో నింపకుండా కొన్ని షేర్లనే ఎంచుకోవడం
- ప్రతి స్టాక్‌ పొజిషన్‌ను నిశితంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవడం
- కొత్త స్టాకులను ఎంచుకోవడం కన్నా, ఉన్న స్టాకుల్లో వచ్చే అవకాశాలను వదులుకోకుండా లాభాలను పొందడం

ఈ సూత్రాలతో గత నాలుగేళ్లలో ఆయన పోర్టుఫోలియో దాదాపు పదిరెట్ల లాభాలను ఆందించింది. గత పదేళ్లలో ఆయన కేవలం 14 స్టాకులను మాత్రమే ఎంచుకొని మదుపు చేశారు. అందులో ఎనిమిదింటిని సమయానుకూలంగా వదిలించుకున్నారు. ప్రస్తుతం ఆయన పోర్టుఫోలియోలో ఉన్న 6 స్టాకులు 3- 12 రెట్ల లాభాల్లో ఉన్నాయి. మల్టీబాగర్‌ను ఎంచుకోవడానికి ఓపిక అవసరమని, ఒకసారి ఎంచుకున్నాక ఆ స్టాకు సరైన రాబడినిచ్చేవరకు వదుల్చుకోకుండా ఉంచుకోవాలని ఆయన చెబుతుంటారు. ఎంచుకునే సమయంలో సదరు కంపెనీ మూలాలను క్షుణ్ణంగా పరిశీలిస్తానని చెప్పారు.

ఆయన ఎంపికచేసిన ఆణిముత్యాల్లో మచ్చుకుకొన్ని... 1. మయూర్‌ యునికోటర్స్‌- 4సంవత్సరాల్లో 67 శాతం రాబడినిచ్చింది.2. ఇండాగ్‌ రబ్బర్‌- 4సంవత్సరాల్లో 300 శాతం రాబడినిచ్చింది.


కొత్తవారికి సలహాలు
కొత్తగా మార్కెట్లో కాలుమోపేవారికి డా. స్టాక్‌ కొన్ని విలువైనసలహాలిస్తున్నారు...
- మీకు సరిపోయే స్టాకును, మీ పెట్టుబడి విధానానికి అనువైన స్టాకును ఎంచుకోండి.
- బెంజిమన్‌ గ్రాహిమ్‌, కంపెనీల వార్షిక రిపోర్టులను సంపూర్ణంగా అధ్యయనం చేయండి.
- కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఎలా ఉంటోందో శ్రద్ధగా పరిశీలించండి.
- మీ పొజిషన్లు ఎందుకు తీసుకున్నారో వేరే వారికి వివరణలు ఇచ్చే ‍ప్రయత్నం వద్దు. మీ ఎంపికపై మీకు నమ్మకం ఉంటే చాలు.You may be interested

కర్ణాటక బ్యాంకుకు క్యూ1 ఫలితాల షాక్‌

Monday 17th July 2017

క్యూ1 ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడంతో కర్ణాటక బ్యాంక్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం బ్యాంకు షేరు ధర నాలుగు శాతం పడిపోయింది.  ప్రస్తుతం కంపెనీ షేరు రూ.159 వద్ద ట్రేడవుతోంది.ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసిక  ఫలితాలను శనివారం బ్యాంకు ప్రకటించిం‍ది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే   నికర లాభం‍10 శాతం​ఎగసి రూ.132 కోట్లను ఆర్జించింది.వడ్డీ ఆదాయం​ 16 శాతం​ పెరిగి రూ.424 కోట్లకు చేరింది. కరెంట్‌, సేవింగ్స్‌

కేడిలా హెల్త్‌కేర్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ బూస్టింగ్‌

Monday 17th July 2017

ముంబై:- కాడిల్లా హెల్త్‌కేర్‌ షేరు సోమవారం ఇంట్రాడేలో 2శాతానికి పైగా లాభపడింది. కాడిల్లా అనుబంధ సంస్థ జైడస్‌ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఫింగోలిమోడ్‌ ఔషదానికి తాత్కాలిక అనుమతులు పొందినట్లు గత శుక్రవారం(జూలై 14) ప్రకటించింది. అనుమతి పోందిన ఫింగోలిమోడ్‌ ఔషదాన్ని మల్టిపుల్ స్కెరోసిస్(నాడీ శాఖలపై క్షీణత వల్ల సంభవించే కండర బలహీనత)వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఔషద అమ్మకాల మార్కెట్‌ విలువ సుమారు 13వేల కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి.

Most from this category