STOCKS

News


ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే పునరాలోచించాల్సిందే

Saturday 7th April 2018
personal-finance_main1523106867.png-15298

మార్కెట్లలో ఎప్పుడూ మంచిగా రాణించే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలే ఉంటాయనుకోవడం పొరపాటే. రాబడుల్లో వెనుకబడి ఉండేవి కొన్ని అయితే, బ్యాంకు వడ్డీ రేట్ల కంటే దారుణంగా ప్రతిఫలం ఇచ్చేవి, చివరికి ద్రవ్యోల్బణం స్థాయిలో అయినా రాబడులు ఇవ్వని పథకాలు కూడా ఉంటాయని నమ్మక తప్పదు. ఇది నిజమని నమ్మాలంటే ఈ గణాంకాలను ఓ సారి పరిశీలించాల్సిందే.

రాబడుల్లో చెత్త

బరోడా పయనీర్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడులు 3.10 శాతం. ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ పథకంలో అయితే రాబడులు 1.73 శాతమే. రాబడుల పరంగా ఇది అత్యంత దారుణ పనితీరు. టారస్‌ బొనాంజా ఫండ్‌లో రాబడులు 3.26 శాతం, బరోడా పయనీర్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో 4.55 శాతం, యూనియన్‌ ఈక్విటీ ఫండ్‌లో 3.75 శాతం, యూఐటీ అపార్చునిటీస్‌ ఫండ్‌లో 5.15 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ప్రిమియర్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌లో 7.27 శాతం, టారస్‌ స్టార్‌ షేర్‌ ఫండ్‌లో 5.24 శాతం, టాటా ఎథికల్‌ ఫండ్‌లో 6.21 శాతం, ఐడీబీఐ ఇండియా టాప్‌ 100 ఈక్విటీ ఫండ్‌లో 5.36 శాతం, ఎడెల్వీజ్‌ ప్రుడెంట్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌-ఎలో 6.98 శాతం చొప్పున వార్షిక రాబడులు గత మూడేళ్ల కాలంలో ఉన్నాయి. పన్ను ఆదా ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను పరిశీలిస్తే యూనియన్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ రాబడులు 3.23 శాతం, బీఎన్‌పీ పారిబాస్‌ ఎల్‌టీ ఈక్విటీ ఫండ్‌ 6.57 శాతం చొప్పునే రాబడులు ఇచ్చాయి. 

పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్త

సాధారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిపుణులైన వారు నిర్వహిస్తూ ఉంటారు. రాబడుల కోసం మన కష్టార్జితాన్ని తీసుకెళ్లి వారికి అప్పగిస్తాం. వారు సరైన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసి మెరుగైన రాబడులు అందించాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నదే అందుకు. ఇదే ఉద్దేశ్యంతో బ్లైండ్‌గా ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే నష్టపోవాల్సి వస్తుందని, అనుకున్న లక్ష్యాలు నెరవేరవని చెప్పేందుకు పై పథకాలే పక్కా నిదర్శనం. ఓ పథకం పనితీరును అదే విభాగంలోని పోటీ పథకాలతో, బెంచ్‌ మార్క్‌ సూచీలతో పోలుస్తుంటారు. పథకం పనితీరు ఈ రెండింటికి మించి ఉండడం కీలకమైనదిగా పరిగణించాలి. 255 ఈక్విటీ పథకాల్లో 30 శాతానికి పైగా సూచీల స్థాయిలోనూ రాబడులు ఇవ్వలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో 19 లార్జ్‌ క్యాప్‌, 15 మిడ్‌క్యాప్‌, 21 మల్టీక్యాప్‌, 2 స్మాల్‌ క్యాప్‌, 14 ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు ఉన్నాయి. You may be interested

ప్రమోటర్ల తాకట్టు వాటాలు రూ.2.4 లక్షల కోట్లు

Saturday 7th April 2018

ప్రమోటర్లు తమ కంపెనీల్లో తమకున్న వాటాలను అడ్డంగా తాకట్టు పెట్టి రుణాలు తీసేసుకునే ధోరణి ఇటీవల పెరిగిపోయింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో చూస్తే ఇలా ప్రమోటర్లు తాకట్టు పెట్టిన వాటాల విలువ రూ.2.4 లక్షల కోట్లు. అంతకు ముందు డిసెంబర్‌ త్రైమాసికం నాటి విలువ కంటే చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గడం గమనార్హం. అయితే, ఈ తగ్గుదల మార్కెట్లో కరెక్షన్‌ వల్ల వచ్చిందనే అనుకోవాలి. కరెక్షన్‌ కారణంగా ఇటీవలి కాలంలో స్టాక్స్‌

ఈ స్టాక్స్‌కు లాభాల ‘వర్షం’

Saturday 7th April 2018

వచ్చేది వర్షకాలం. మన ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు జీవనాధారం. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కావడం, ప్రధానంగా గ్రామీణ ఆర్థిక రంగం వర్షాలపైనే ఆధారపడి ఉండడం తెలిసిందే. అందుకే వర్షాలు అటు విధానకర్తలకు, కార్పొరేట్‌ కంపెనీలకు, ఇన్వెస్టర్లకు కీలకం. ఈ నెల్లోనే భారత వాతావరణ శాఖ రుతుపవనాలపై తన అంచనాలను వెలువరించనుంది. ఈలోపే ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్‌ ఈ ఏడాది రుతుపవనాల గమనం ఆటంకాల్లేకుండా సాఫీగానే ఉంటుందని రెండు

Most from this category