STOCKS

News


టీసీఎస్‌కు 2 బిలియన్ డాలర్ల డీల్‌

Friday 12th January 2018
news_main1515780070.png-13091

  •  అమెరికన్ బీమా సంస్థ ట్రాన్స్‌అమెరికా నుంచి కాంట్రాక్టు

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) తాజాగా 2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకుంది. అమెరికాకు చెందిన బీమా సంస్థ ట్రాన్స్‌ అమెరికా నుంచి ఈ కాంట్రాక్టు లభించినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ కాంట్రాక్టు కింద అమెరికాలో ఆ కంపెనీ బీమా, యాన్యుటీ వ్యాపార విభాగాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సర్వీసులు అందించాల్సి ఉంటుంది. 2018 రెండో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని టీసీఎస్ తెలియజేసింది. దీంతో ట్రాన్స్‌అమెరికాకు వార్షికంగా 70-100 మిలియన్ డాలర్ల దాకా వ్యయాలు ఆదా కాగలవని పేర్కొంది. ప్రస్తుతం ట్రాన్స్‌ అమెరికాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,200 మంది సిబ్బందికి తమ సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే, స్థానికంగా మరింత మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు. మరింతగా పొదుపు, మదుపు చేసేలా తమ కస్టమర్లకు తోడ్పాటునివ్వడానికి టీసీఎస్‌తో డీల్ ఉపయోగపడగలదని ట్రాన్స్‌ అమెరికా ప్రెసిడెంట్ మార్క్ మలిన్ చెప్పారు. టీసీఎస్‌ డిసెంబర్‌ క్వార్టర్‌లో సుమారు నాలుగు శాతం క్షీణతతో రూ.6,531 కోట్లకు నికర లాభం ప్రకటించిన నేపథ్యంలో తాజా డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు సుమారు అరశాతం క్షీణించి రూ. 2,773 వద్ద క్లోజయ్యింది. 



You may be interested

పగ్గాలు తెంచుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం

Friday 12th January 2018

డిసెంబర్‌లో 5.21 శాతానికి చేరిక నవంబర్‌లో ఇది 4.88 శాతం న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్‌ మాసంలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్‌)  ద్రవ్యోల్బణం గత నవంబర్‌ నెలలో 4.88

టాటా కెమికల్స్‌ యూరియా వ్యాపార విక్రయం పూర్తి

Friday 12th January 2018

 విలువ రూ.2,682 కోట్లు   యూరియా రంగంలో తొలి ఎఫ్‌డీఏ డీల్‌ న్యూఢిల్లీ: టాటా కెమికల్స్‌ కంపెనీ తన యూరియా, కస్టమైజ్‌డ్‌ ఫెర్టిలైజర్స్‌ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్‌ ఈ వ్యాపారాన్ని  నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్‌ ఎఎస్‌ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్‌ ఇండియాకు రూ.2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బబ్రల ప్లాంట్‌ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్‌కు టాటా కెమికల్స్‌ అమ్మేసింది. నియంత్రణలు

Most from this category