STOCKS

News


టాటా స్టీల్‌ లాభం రూ.14,688 కోట్లు 

Wednesday 16th May 2018
news_main1526487343.png-16517

  • నష్టాల నుంచి లాభాల్లోకి

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.14,668 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బ్రిటన్‌ వ్యాపార పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన రూ.11,376 కోట్ల ఏకీకృత ఆదాయం ఈ స్థాయిలో లాభం పెరగడానికి కారణమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,168 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఈ మేరకు జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను బీఎస్‌ఈకి కంపెనీ తెలియజేసింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.36,407 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.35,457 కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా పెరిగినట్టు తెలుస్తోంది. దేశీయంగా ఉత్పత్తి ఈ క్వార్టర్లో 3 మిలియన్‌ టన్నుల మేర తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే వ్యయాలు రూ.31,132 కోట్ల నుంచి రూ.32,626 కోట్లకు పెరిగిపోయాయి. 2017-18లో కంపెనీ పనితీరు చాలా బలంగా ఉందని ఎండీ, సీఈవో టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. కంపెనీ బలమైన నిర్వహణ విధానానికి అంతర్జాతీయ సానుకూల డిమాండ్‌ మద్దతుగా నిలిచిందన్నారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరు సాధ్యమైందని తెలిపారు. ‘‘బ్రిటన్‌ పెన్షన్‌ పథకం పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయింది. థిస్సెంక్రప్‌తో 50:50 భాగస్వామ్యం చక్కగా నడుస్తోంది. బలమైన యూరోప్‌ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం’’ అని నరేంద్రన్‌ వివరించారు. దేశీయంగా విస్తరణ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. కళింగనగర్‌ ఫేస్‌-2 విస్తరణ చక్కగా కొనసాగుతోందని, ఇది తమ స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 మిలియన్‌ టన్నుల నుంచి 18 మిలియన్‌ టన్నులకు తీసుకెళుతుందన్నారు. భూషణ్‌ స్టీల్‌కు సంబంధించి తమ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ, సీసీఐ ఆమోదాలు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 



You may be interested

టీవీఎస్‌ మోటార్‌ లాభం 31 శాతం అప్‌...

Wednesday 16th May 2018

రూ.700 కోట్ల పెట్టుబడులు వాహనాల ధరలు పెరిగే అవకాశం !  న్యూఢిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌లో 31 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016-17)క్యూ4లో రూ.127 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.166 కోట్లకు పెరిగిందని టీవీఎస్‌ కంపెనీ పేర్కొంది. ఆదాయం రూ.3,076 కోట్ల నుంచి రూ.3,993 కోట్లకు ఎగసిందని కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్‌

హోండా అమేజ్‌లో రెండో జనరేషన్‌

Wednesday 16th May 2018

ప్రారంభ ధర రూ.5.59 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హోండా కార్స్‌’ తాజాగా తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘అమేజ్‌’లో కొత్తగా సెకండ్‌ జనరేషన్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. ఇది ఈ, ఎస్‌, వీ, వీఎక్స్‌ అనే నాలుగు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిల్లో డ్యూయెల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్‌  పార్కింగ్‌ సెన్సర్స్‌, ఏబీఎస్‌ వంటి పలు

Most from this category