STOCKS

News


టీసీఎస్‌ షేర్లు విక్రయించిన టాటా సన్స్‌

Tuesday 13th March 2018
Markets_main1520961716.png-14644

  • 3.12 కోట్ల షేర్ల అమ్మకం
  • విక్రయ విలువ రూ.9,000 కోట్లు ! 

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)లో 1.63 శాతానికి సమానమైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ టాటా సన్స్‌ విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఈ షేర్ల విక్రయం జరిగింది.  ఈ షేర్ల విక్రయ విలువ దాదాపు రూ.9,000 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్‌ డేటా ప్రకారం 2.06 కోట్ల షేర్లను రూ.2,876 ధరకు, 1.06 కోట్ల షేర్లను రూ.2,872 ధరకు విక్రయించారు. మొత్తం 3.12 కోట్ల షేర్ల విక్రయం ద్వారా టాటా సన్స్‌కు  రూ.8,990 కోట్లు లభించాయి. ఈ వాటా షేర్ల విక్రయం అనంతరం టీసీఎస్‌లో టాటా సన్స్‌ వాటా 72 శాతానికి తగ్గుతుంది. ఈ షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తాన్ని టాటా గ్రూప్‌ కంపెనీ టాటా టెలిసర్వీసెస్‌కు భారీగా ఉన్న రూ.40,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగిస్తారని సమాచారం. ఈ షేర్ల విక్రయం నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేర్‌ 5 శాతం నష్టపోయి రూ.2,886 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. 


 



You may be interested

ఎస్‌బీఐలో 41.2 లక్షల ఖాతాలు క్లోజ్‌

Tuesday 13th March 2018

కనీస నిల్వ లేకపోవడం వల్లేనని బ్యాంకు వెల్లడి ఇండోర్‌: ప్రభుత్వరంగ ఎస్‌బీఐ కనీస నిల్వలేమి కారణంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా 41.2 లక్షల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలను మూసేసింది. కనీస బ్యాలన్స్‌ల నిర్వహణలో విఫలమైతే చార్జీల విధింపును గతేడాది ఏప్రిల్‌ నుంచి బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం జరిగిన విషయం

గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’!

Tuesday 13th March 2018

 ప్రైవేటీకరణ దిశగా కేంద్రం సన్నాహాలు...  ప్రైవేటు సంస్థలకు నేరుగా వాటా విక్రయం..!  వాటాకు అనుగుణంగా బోర్డ్‌ మెంబర్లలో సభ్యత్వం కూడా..  పబ్లిక్‌ ఇష్యూలకు సైతం సన్నాహాలు...  వాటాలను పూర్తిగా కోల్పోనున్న రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా

Most from this category