STOCKS

News


‍ట్రంప్‌ వాఖ్యలతో టాటామోటర్స్‌కు బ్రేకులు

Monday 5th March 2018
Markets_main1520243905.png-14365

ఏడాది కనిష్టానికి పతమైన షేరు.
ముంబై:- స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్‌ చర్యలకు యూరోపియన్‌ యూనియన్‌  ప్రతిచర్యలకు సిద్ధమైంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై తాము కూడా సుంకాలను విధిస్తామని హెచ్చరించింది. దాంతో యూరప్‌ నుంచి దిగుమతయ్యే కార్లపై తాను దిగుమతి సుంకాల్ని విధిస్తామంటూ ట్రంప​ ప్రతిహెచ్చరిక చేసిన నేపథ్యంలో యూరప్‌లో జాగ్వర్‌ లాండ్‌రోవర్‌ ప్లాంటు కలిగిన టాటా మోటర్స్‌పై ప్రభావాన్ని చూపింది. సోమవారం టాటా మోటర్స్‌ షేరు రూ.370.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. వాణిజ్య యుద్ధం ప్రభావంతో ఇంట్రాడేలో 5శాతానికి పైగా పతనమై రూ.351.00ల వద్ద ఏడాది కనిష్టస్థాయికి పతనమైంది. మధ్యహ్నం 3:15ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.370.85)తో పోలిస్తే) 5.03శాతం నష్టపోయి రూ.352.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.351.00లు, 487.00లుగా నమోదయ్యాయి. జాగ్వర్‌, లాండ్‌రోవర్‌లకు చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్‌ అమెరికాయే. 



You may be interested

మార్కెట్‌ను వణికించిన వాణిజ్య యుద్ధం

Monday 5th March 2018

సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాస్‌... 10,400 దిగువకు నిఫ్టీ ముంబై:- ప్రపంచవ్యాప్తంగా మొదలైన వాణిజ్యయుద్ధం మార్కెట్‌ను తీవ్ర నష్టాలపాలు చేసింది. యూఎస్‌లోకి దిగుమతయ్యే స్టీల్‌, అల్యూమినియంపై టారిఫ్‌లు విధిస్తామంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనకు పలు దేశాలు ప్రతిచర్యగా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై తాము కూడా సుంకాలను విధిస్తామని హెచ్చరించాయి. ఆ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొదలవుతుందన్న భయాలు మార్కెట్లో ఏర్పడ్డాయి. దీనికి తోడు  ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుపై ఇన్వెస్టర్ల అప్రమత్తత,

మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లను ఒడిసిపట్టండి!

Monday 5th March 2018

ట్రేడ్‌ బుల్స్‌ నిపుణుడు సచ్చిదానంద్‌ సూచన ఐటీ రంగ షేర్లకు మంచి భవిష్యత్‌ ఉన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లను పోర్టుఫోలియోలో చేర్చుకోవాలని ట్రేడ్‌బుల్స్‌ సచ్చిదానంద్‌ ఉట్టేకర్‌ సలహా ఇస్తున్నారు. ఇతర సూచీలతో పోలిస్తే ఐటీ సూచీ అవుట్‌పెర్ఫామ్‌ చేస్తుందన్నారు. తాజా కరెక‌్షన్‌లో భాగంగా మిడ్‌క్యాప్‌ షేర్లు కూడా వెనకడుగు వేశాయని, ఈ తరుణాన్ని నాణ్యమైన షేర్లు ఎంచుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నెల్లోనే ఐటీ సూచీ మంచి

Most from this category