STOCKS

News


వాటా అమ్మకంతో టీసీఎస్‌ 5 శాతం డౌన్‌

Tuesday 13th March 2018
Markets_main1520925548.png-14618

ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరు ధర మంగళవారం నేలచూపులుచూసింది. మధ్యాహ్నం రూ.152 (5 శాతం) పడిపోయి రూ.2,899 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.2,872 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. ఈ కంపెనీలోని రూ.8,122 కోట్ల (1.25 బిలియన్‌ డాలర్లు) విలువైన వాటాను హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ బల్క్‌డీల్‌ రూపంలో అమ్మివేసినట్లు వెల్లడయ్యింది. కంపెనీలోని 1.5 శాతం వాటాను రూ.2,872-2,925 స్థాయిలో అమ్మివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈస్థాయికి షేరు ధర దిగివచ్చింది. ఈడీల్‌ జరగకముందు (డిసెంబరునాటికి) టీసీఎస్‌లో టాటా సన్స్‌కు 73.5 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే.



You may be interested

ఆయిల్‌&గ్యాస్‌ షేర్ల హవా..!

Tuesday 13th March 2018

ముంబై:- ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు మంగవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ రంగానికి బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సూచీగా ఉన్న ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ నేడు ఒకటిన్నర శాతం వరకు లాభపడింది. ఇంట్రాడేలో 15,609 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదుచేసింది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) షేరు ధర 5.15 శాతం పెరిగింది. ఇంట్రాడేలో రూ.385.35 తాకింది. మధ్యాహ్నం 1:00 సమయానికి

ఆల్గోట్రేడింగ్‌కు పగ్గాలు?!

Tuesday 13th March 2018

చార్జీలు విధించే యోచనలో సెబి.. ఆల్గారిధమ్‌ ట్రేడింగ్‌పై సాంద్ర ఆధారిత(కంజెషన్‌) రుసుము విధించడం ద్వారా కట్టడి చేయాలని సెబి భావిస్తోంది. వివిధ శ్లాబులను ఏర్పరిచి వాటికనుగుణంగా ట్రేడర్ల నుంచి కంజెషన్‌ చార్జీలు వసూలు చేసే దిశగా యత్నాలు ఆరంభించింది. ఈ చార్జీల ద్వారా ఆల్గో ట్రేడింగ్‌ అందుబాటులో లేని వినియోగదారులకు, అల్గో ట్రేడర్స్‌కు మధ్య బేధాన్ని తొలగించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు సాధారణ ట్రేడర్లతో పోలిస్తే ఆల్గోట్రేడర్లు సాంకేతికతతో అనుచిత లబ్ది పొందుతూవస్తున్నారు.

Most from this category