STOCKS

News


టాటా కెమికల్స్‌ యూరియా వ్యాపార విక్రయం పూర్తి

Friday 12th January 2018
news_main1515779989.png-13090

  •  విలువ రూ.2,682 కోట్లు 
  •  యూరియా రంగంలో తొలి ఎఫ్‌డీఏ డీల్‌

న్యూఢిల్లీ: టాటా కెమికల్స్‌ కంపెనీ తన యూరియా, కస్టమైజ్‌డ్‌ ఫెర్టిలైజర్స్‌ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్‌ ఈ వ్యాపారాన్ని  నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్‌ ఎఎస్‌ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్‌ ఇండియాకు రూ.2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బబ్రల ప్లాంట్‌ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్‌కు టాటా కెమికల్స్‌ అమ్మేసింది. నియంత్రణలు అధికంగా ఉన్న యూరియా రంగంలో ఇది తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ షరతులు, సూచనల ప్రకారమే ఈ వాటా విక్రయం పూర్తయినట్లు టాటా కెమికల్స్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. కాగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎరువుల మార్కెట్‌ అయిన భారత్‌లో ప్రవేశించడం ఉత్సాహాన్నిస్తోందని యారా ఇంటర్నేషనల్‌ సీఈఓ, ప్రెసిడెంట్‌  స్వీన్‌ టొరె హొల్‌సెథర్‌ వ్యాఖ్యానించారు. తమ కంపెనీకి ఇది కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన బబ్రల ప్లాంట్‌ ఏడాదికి 7 లక్షల టన్నుల అమ్మోనియాను, 12 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. ఇక నుంచి ఈ యూరియాను యారావెరా బ్రాండ్‌తో యారా ఫెర్టిలైజర్స్‌ ఇండియా విక్రయిస్తుంది. ఈ డీల్‌ పూర్తయిన నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా కెమికల్స్‌ షేర్‌ 1.1 శాతం నష్టంతో రూ.762 వద్ద ముగిసింది. 


 



You may be interested

టీసీఎస్‌కు 2 బిలియన్ డాలర్ల డీల్‌

Friday 12th January 2018

 అమెరికన్ బీమా సంస్థ ట్రాన్స్‌అమెరికా నుంచి కాంట్రాక్టు న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) తాజాగా 2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకుంది. అమెరికాకు చెందిన బీమా సంస్థ ట్రాన్స్‌ అమెరికా నుంచి ఈ కాంట్రాక్టు లభించినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ కాంట్రాక్టు కింద అమెరికాలో ఆ కంపెనీ బీమా, యాన్యుటీ వ్యాపార విభాగాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సర్వీసులు అందించాల్సి ఉంటుంది. 2018 రెండో త్రైమాసికంలో

సరికొత్త గరిష్టస్థాయి వద్ద ముగింపు

Friday 12th January 2018

ముంబై:- దేశీయ సూచీలు శుక్రవారం కొత్త రికార్డులను నమోదు చేసి సరికొత్త గరిష్టస్థాయి వద్ద ముగిశాయి. మీడియా, మెటల్‌, బ్యాంక్‌ రంగ షేర్ల ర్యాలీకి తోడు, యూరప్‌ మార్కెట్ల సానూకూల ఓపెనింగ్‌... సూచీలు ర్యాలీకి కారణమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88.90 పాయింట్ల లాభంతో 34,592 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16.65 పాయింట్ల లాభంతో 10,667 పాయింట్ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్‌ 34,342 -34,638 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. బీఎస్‌ఈలో మెటల్‌, ఇంధన,

Most from this category