News


కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు...

Monday 10th July 2017
Markets_main1499682499.png-5116


సోమవారం స్టాక్‌ సూచీలు కొత్త శిఖర స్థాయిలకు ఎగిసి, రికార్డ్‌ స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 31,700 పాయింట్లు. నిఫ్టీ 9,750 పాయింట్ల ఎగువున ముగిశాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో మూడు గంటల పాటు ట్రేడింగ్‌ జరగనప్పటికీ (ట్రేడింగ్‌ గం.12.30 వరకూ జరగలేదు) నిఫ్టీ వంద పాయింట్లకు పైగా పెరిగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ సూచీలు రోజంతా అదే దూకుడు చూపించాయి. ఈ వారం నుంచి వెలువడే ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే ఆశావహ అంచనాల నేపథ్యంలో  ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ స్టాక్‌ సూచీలు కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డ్‌ స్థాయికి పెరగడం, దేశవ్యాప్తంగా ఒకే పన్ను-జీఎస్‌టీ అమలు సాఫీగా సాగుతుండడం సానుకూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ 355 పాయింట్ల లాభంతో 31,716 పాయింట్ల వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 9,771 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇవి రెండూ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలు, ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 407 పాయింట్ల లాభంతో 31,768 పాయింట్లకు, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 9,782 పాయింట్లకు ఎగిశాయి. ఇవి రెండూ ఈ సూచీలకు కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలు. దివిస్‌ ల్యాబ్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, టాటా గ్లోబల​ బేవరేజేస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ, కెనరా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులర్‌, వెల్‌స్పన్‌ ఇండియా, భారత్‌ ఫైనాన్షియల్‌, మార్క్‌శాన్స్‌ ఫార్మా, టాటా కాఫీ షర్లు 3-6 శాతం రేంజ్‌లో పెరిగాయి. 31 సెన్సెక్స్‌ షేర్లలో మూడు  - హిందుస్తాన్‌ యూనిలివర్‌, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా  మినహా మిగిలిన 28 షేర్లు లాభాల్లో ముగిశాయి. 







You may be interested

షేర్ల విభజన వార్తలతో సియోరం షేర్‌ షైనింగ్‌

Monday 10th July 2017

ముంబై:- ఈక్విటి షేర్ల విభజన వార్తల నేపథ్యంలో సోమవారం సియోరాం షేర్‌ ఇంట్రాడేలో 4శాతం వరకు పెరిగింది. ఈ నెల 26న జరిగే బోర్డు సమావేశం ఈక్విటీ షేర్ల విభజనపై నిర్ణయం తీసుకోనుంది. ఈ వార్తల నేపధ్యంలో షేరు సోమవారం ఇంట్రాడేలో 4 శాతం లాభపడి రూ.2304ల వరకు పెరిగింది. మార్కెట్‌ ముగిసే సమయానికి నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే 2శాతం లాభపడి రూ. 2263ల వద్ద ముగిసింది. కాగా

బతుకు బండికి బఫెట్‌ సూత్రాలు

Monday 10th July 2017

జీవితంలో సక్సెస్‌కు 'ఇన్వెస్ట్‌మెంట్‌ గురు' సలహాలు వారెన్‌ బఫెట్‌.. ‘‘వారెవ్వా’’ బఫెట్‌ అని ప్రపంచం ముక్తకంఠంతో కొనియాడిన మదుపు మారాజు... స్టాక్‌మార్కెట్లో సంపాదించడం ఇంత ఈజీనా అనేలా కోట్లు ఆర్జించిన కుబేరుడు.. అంతేనా.. కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టేవాళ్లకు స్ఫూర్తిదాత...  బఫెట్‌ అంటే ఒక బ్రాండ్‌.. ఇంతేనా... కానేకాదు. అంతకుమించి బఫెట్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది... చూద్దామా.. వారెన్‌ బఫెట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకువచ్చేది షేర్లలో పెట్టుబడులు, సంపాదన గురించి ఆయన చెప్పే సూత్రాలు, వ్యూహాలు,

Most from this category