News


9900 పైన నిఫ్టీ ముగింపు

Monday 17th July 2017
Markets_main1500287169.png-5518

మరోమారు రికార్డుల మోత
సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ‍స్వల్ప లాభాల్లో ముగిసింది. అయినా స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులో కూడా కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. ఇంట్రాడేలో  జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన స్టాక్‌ సూచీలు ట్రేడింగ్‌ అంతా  పరిమిత శ్రేణిలోనే కదలాడాయి.  చైనా జీడీపీ అంచనాలను మించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 32,075 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 9,916 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇవి రెండు ఈ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు  నిఫ్టీ 9,900 పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 32,132 పాయింట్లు, నిఫ్టీ 9,928 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇవి రెండూ ఆ యా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. ఐటీ షేర్లు లాభపడ్డాయి. విప్రో, సిప్లా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, వేదాంత షేర్లు లాభపడగా, ఐటీసీ, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. 







You may be interested

ఎస్‌ఎంఈ ఐపీవో అని తేలిగ్గా తీసేయకండి!

Monday 17th July 2017

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి నుంచి జూన్‌ వరకు) 50 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్‌ఎంఈ) ఏకంగా రూ.660 కోట్లను ఐపీవో రూట్లో సమీకరించాయి. 2016 తొలి ఆరు నెలల్లో కేవలం 27 కంపెనీలు, రూ.211 కోట్ల నిధుల సమీకరణతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా ఎక్కువ. అంతేకాదు 2016 పూర్తి ఏడాదిలో 66 కంపెనీలు సమీకరించిన రూ.540 కోట్ల కంటే కూడా ఎక్కువే. ప్రధాన కంపెనీల ఐపీవోలకు

హమ్మో! ఐపీఓ మాయ..

Monday 17th July 2017

కుదేలవుతున్న చిన్న మదుపరి పబ్లిక్‌ ఆఫర్‌ అంటే ఇన్వెస్టర్లకు ఎంతో మోజు. భారీ ప్రీమియంతో లిస్టయి తమకు మంచి లాభాలనందిస్తాయన్న ఆశలతో పలువురు చిన్నాచితకా ఇన్వెస్టర్లు ఐపిఒల వైపు ఆబగా చూస్తుంటారు. పైసాపైసా కూడబెట్టి ఐపిఒలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం ఒకఎత్తయితే, దరఖాస్తు చేసుకున్నన్ని షేర్లు మంజూరవుతాయో లేదో? అన్న టెన్షన్‌ మరోఎత్తు. ఇంతాచేసేది లిస్టింగ్‌ రోజు  లాభాల కోసమే. అయితే కొందరు ఆపరేటర్లు ఇలాంటి చిన్న మదుపరులను ఆశల

Most from this category