News


జీఎస్‌టీఎన్‌ సమస్యపైనే సమావేశంలో ప్రధాన చర్చ

Saturday 9th September 2017
news_main1504944899.png-8309

హైదరాబాద్‌లో జరుగుతున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ 21వ సమావేశంలో గూడ్స్ అండ్‌ సర్వీస్ టాక్స్ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌)పైనే ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. లోడ్‌ పెరిగిన కారణంగా పోర్టల్‌ ఆగిపోవడం, రిటర్న్స్‌ దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. జీఎస్‌టీఎన్‌ పర్యవేక్షణ నిమిత్తం మంత్రులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని జమ్ము & కాశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ప్రస్తావించగా.. మిగిలిన రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఈ అంశానికి మద్దతు తెలిపారు. 2-3 నెలలపాటు ఈ బృందం జీఎస్‌టీఎన్‌ను పరిశీలించి సమస్యలను అధిగమించాలని కోరారు. అగస్టు 29తో తొలి జీఎస్‌టీఎన్‌ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌ పదవీకాలం ముగియడంతో ఈయన స్థానంలో యూఐడీఏఐ సీఈఓ ఏ.బీ పాండేను తాత్కాలిక చైర్మన్‌గా కౌన్సిల్‌ నియమించిన సంగతి తెలిసిందే.







You may be interested

ఈ స్టాకు విషయమై పోరింజును ఫాలో కావచ్చా?

Saturday 9th September 2017

ఆర్వీ డెనిమ్స్‌ షేరు ధర ఒక వారంలోనే 47 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రముఖ ఇన్వెస్టర్‌ పోరింజు భారీగా షేర్లు కొనడమే ఇందుకు కారణం. ఇండియాలో ప్రముఖ ఇన్వెస్టర్లలో ఒకరైన  పొరింజు వెలియాత్‌ ఆర్వీ డెనిమ్స్‌లోని 1.18 లక్షల షేర్లను కోనుగోలు చేశారు. దీంతో  చిన్నా చితకా ఇన్వెస్టర్లు  ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు  ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో  ఇకపై షేరు  ర్యాలీ కొనసాగిస్తుందా లేదా ఢమాల్‌

ఈ ఐదు రంగాలు మల్టీబాగర్ల గనులు...

Saturday 9th September 2017

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతానికైతే మంచి లాభాల ర్యాలీని చేస్తున్నాయి. మార్కెట్‌ వాల్యూయేషన్స్‌ పెరిగిపోవడంతో మార్కెట్‌ బబుల్‌ ఎప్పుడైనా పేలవచ్చనే కొందరి అంచనాలు  ఇన్వెస్టర్లను మరింత భయపెడుతున్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. మరీ దీర్ఘకాలంపాటు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఏ రంగానికి చెందిన స్టాకులను ఎంపిక చేసుకోవాలి..? ఈ సెక్టార్‌కు చెందిన స్టాకులు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాలను పంచుతాయి(మల్టీబ్యాగర్లు)..? చూద్దాం... ఇలాంటి

Most from this category