STOCKS

News


షెల్‌ కంపెనీలపై కొరడా..

Tuesday 12th September 2017
news_main1505240795.png-8456

  • 1 లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు!!

న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్న వారిపై మరిన్ని కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. షెల్ కంపెనీలతో సంబంధమున్న దాదాపు 1.06 లక్షల మంది పైగా డైరెక్టర్లపై అనర్హత వేటు పడనుంది. సెప్టెంబర్ 12 నాటికి కంపెనీల చట్టంలోని సెక్షన్ 164 కింద అనర్హత వేటు వేయతగిన డైరెక్టర్లుగా 1,06,578 మందిని గుర్తించినట్లు, వీరిపై ఆమేరకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ సెక్షన్ ప్రకారం వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు వార్షిక నివేదికలు సమర్పించని కంపెనీల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు అదే కంపెనీలో పునర్నియామకానికి గాని లేదా ఇతర కంపెనీల్లో గానీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గానీ అర్హత కోల్పోతారు. ఈ నెలాఖరు నాటికల్లా షెల్ కంపెనీలతో సంబంధమున్న డైరెక్టర్ల పూర్తి వివరాలతో జాబితా సిద్ధం కాగలదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెప్పారు.
చాన్నాళ్లుగా వ్యాపార కార్యకలాపాలు జరగని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇటీవలే రద్దు చేసిన దరిమిలా తాజా ప్రతిపాదిత చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటు పరమావధి, డైరెక్టర్లు, లబ్ధిదారుల నిగ్గు తేల్చే దిశగా ఆయా సంస్థల డేటాను కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలిస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. ఈ సంస్థల ఆధ్వర్యంలో మనీలాండరింగ్ కార్యకలాపాల్లాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. సదరు డిఫాల్ట్ కంపెనీలతో సంబంధమున్న వృత్తి నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్లు మొదలైన వారిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారిపై ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ తదితర వృత్తి నిపుణుల సంస్థలు తీసుకున్న చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయి. 2.09 లక్షల సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు అయిన తర్వాత ప్రస్తుతం 11 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. You may be interested

జీఎస్‌టీకి ముందున్న రేట్లు తెచ్చేందుకే!!

Tuesday 12th September 2017

కార్ల సెస్సు పెంపుపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: మధ్య శ్రేణి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై 7 శాతం దాకా అదనంగా పెంచిన జీఎస్‌టీ సెస్సుపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం మధ్య స్థాయి కార్లపై మొత్తం జీఎస్‌టీ రేటు 45 శాతంగాను, పెద్ద కార్లపై 48 శాతంగాను, ఎస్‌యూవీలపై 50 శాతంగాను ఉంటుంది. వాహనాల ధరలను జీఎస్‌టీ అమలుకు ముందున్న రేట్ల స్థాయికి తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మధ్య

ఇన్వెస్ట్‌కార్ప్‌ అడ్వైజరీ బోర్డులోకి దీపక్‌ పరేఖ్‌

Tuesday 12th September 2017

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌.. ఇన్వెస్ట్‌కార్ప్‌ ఇంటర్నేషనల్‌ అడ్వైజరీ బోర్డులో చేరారు. ‘ఇన్వెస్ట్‌కార్ప్‌ బలమైన వృద్ధితో పయనిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ డైవర్సిఫైడ్‌ గ్లోబల్‌ ఆల్టర్‌నేటివ్‌ అసెట్‌ మేనేజర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరివర్తన దశలో ఉంది. ఇలాంటి సమయంలో సంస్థ అడ్వైజరీ బోర్డులో చేరినందుకు సంతోషిస్తున్నాను’ అని పరేఖ్‌ తెలిపారు. ఈయన సీమెన్స్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా, బీఏఈ సిస్టమ్స్‌ ఇండియా వంటి కంపెనీల్లో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సేవలు అందిస్తున్నారు. పరేఖ్‌

Most from this category