STOCKS

News


కంపెనీలకు ఐటీఆర్‌ మినహాయింపులు రద్దు

Monday 12th February 2018
news_main1518459573.png-13913

  •  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: డొల్ల కంపెనీలపై కొరడా ఝుళిపించే క్రమంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా .. కట్టాల్సిన పన్ను రూ. 3,000కు లోబడే ఉండే సంస్థలకు ఐటీ రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు నుంచి మినహాయింపునిస్తుండటాన్ని ఇకపై రద్దు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులను ఆదాయ పన్ను విభాగం నిశితంగా పరిశీలిస్తుందని వివరించారు. లాభం తక్కువగా చూపే సంస్థలు, అలాగే తొలిసారిగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న సంస్థలపైన కూడా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు అధికారి పేర్కొన్నారు. సుమారు అయిదు లక్షల పైగా కంపెనీలు రిటర్నులు దాఖలు చేయడం లేదని, మనీలాండరింగ్‌కు ఇవి ఉపయోగపడుతున్నాయన్న సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 
    ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల పైచిలుకు సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వీటిలో సుమారు ఏడు లక్షల సంస్థలు వార్షిక నివేదికలతో పాటు రిటర్నులు కూడా దాఖలు చేస్తున్నాయి. ఇందులో మూడు లక్షల సంస్థలు ఆదాయమే లేనట్లుగా చూపుతున్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 276సీసీ ప్రకారం ఉద్దేశపూర్వకంగా గడువులోపల ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. అయితే, కట్టాల్సిన పన్ను రూ. 3,000కు మించకుంటే మాత్రం ప్రాసిక్యూషన్‌ చర్యలు ఉండవు. కంపెనీలకి ఇస్తున్న ఈ మినహాయింపునే తాజాగా ఎత్తివేస్తూ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా కొత్తగా చట్ట సవరణ చేశారు.
 



You may be interested

ఆర్థిక గణాంకాల ఊరట!

Monday 12th February 2018

 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.1 శాతం  జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), రిటైల్‌ ద్రవ్యోల్బణం అంశాలకు సంబంధించి సోమవారంనాడు విడుదలైన తాజా గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి. తయారీ రంగం ఊతంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2017 డిసెంబర్‌లో 7.1 శాతంగా ఉంది. 2016 డిసెంబర్‌లో ఈ రేటు 2.4 శాతం. అయితే నవంబర్‌ 2017తో (8.8 శాతం) పోల్చితే మాత్రం ఐఐపీ

గెయిల్‌ 1:3 బోనస్‌

Monday 12th February 2018

మూడు షేర్లకు ఒక షేర్‌ బోనస్‌ 28 శాతం పెరిగిన లాభం  న్యూఢిల్లీ: గెయిల్‌ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,262 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధంచిన నికర లాభం(రూ.983 కోట్లు)తో పోల్చితే 28 శాతం వృద్ధి సాధించామని గెయిల్‌ ఇండియా తెలిపింది. గ్యాస్‌ మార్కెటింగ్‌, ప్రసార వ్యాపారం మంచి మార్జిన్‌లు సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ

Most from this category