STOCKS

News


ఇండియాలో షెల్‌ వాహన రీఛార్జీంగ్‌ స్టేషన్లు 

Wednesday 13th September 2017
news_main1505297507.png-8512

భవిష్యత్ రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతోందని ఊహించుకుంటే, హైపర్ లూప్ రవాణా మార్గాలు, బుల్లెట్ రైళ్లు మరియు సిటి రవాణా కోసం మెట్రో రైళ్లు అదే విధంగా వ్యక్తిగత ప్రయాణ అవసరాల కోసం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్లు మదిలో మెదులుతాయి.  

మరి పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను తయారు చేసే కంపెనీల పరిస్థితి ఏమిటని చూస్తే, అవి కూడా ఎలక్ట్రిక్ కార్ల మీద ప్రయోగాలు ముమ్మరం చేస్తూ భవిష్యత్తులో జరిగే మార్పులను ఎదుర్కోవడానికి సిద్దమవుతున్నాయి. అందుకే, ప్రతి ప్యాసింజర్ కార్లు మరియు బైకుల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేస్తున్నాయి.ఇండియాలో కూడా ఎలక్ట్రిక్‌​ వాహనాలకు రిఛార్జీంగ్‌ స్టేషన్లు రాబోతున్నాయా?  చమురు దిగుమతులకు పెట్టె ఖర్చు తగ్గనుందా? అంటే  అవుననే  అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. 

ఆంగ్లో -డచ్‌ సంస్థ రాయల్‌ డచ్‌ షెల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెటింగ్‌  ఆపరేషన్‌ను ఆసియాలో విస్తరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇండియాలో కూడా తమ కంపెనీ కార్యకలపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.  రాయల్‌ డచ్‌ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 43వేల గ్యాస్‌ స్టేషన్లను నడుపుతోంది. వీటిని చైనా, ఇండియా, మెక్సికో దేశాల్లో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తోందని.మార్కెటింగ్‌ , ట్రేడింగ్‌ హెడ్‌ జాన్‌ అబోట్‌ తెలిపారు. ప్రపంచంలో కార్బన్‌ రహిత  శక్తి వ్యవస్థగా మార్చేం‍దుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రతినిధి చెప్పారు. బ్రిటన్‌ , ఫ్రాన్స్‌  2040 కల్లా పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలను నిషేదిస్తామని ప్రకటించాయి.  ఇండియా , చైనా దేశాలు త్వరలో  నిర్ణయం తీసుకోనున్నాయి.   ఈ నేపథ్యంలో భవిష్యత్‌ అంతా  బయోఫ్యూయల్స్‌, బ్యాటరీ రీఛార్జింగ్‌ ,ఎల్‌పీజీల్లాంటి సాంప్రదాయేతర ఇంధన వనరులదేనని చెప్పారు.You may be interested

ష్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 13th September 2017

ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌  ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, స్టాక్‌ సూచీలు అక్కడక్కడే ముగిశాయి. సూచీలు హెచ్చు తగ్గుల మధ్య నిఫ్టీ  17 పాయింట్లు తగ్గి 10079 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 27.79  పాయింట్ల లాభంతో 32,186 పాయింట్ల వద్ద క్లోజయింది. మిడ్‌ క్యాప్‌ సూచీలో కొన్ని రోజుల ర్యాలీ తర్వాత కరెక్షన్‌ చూసింది.   ఫార్మా, ఎనర్జీ, ఇతర

ఇకపై మారుతి కన్నా హీరోనే మిన్న!

Wednesday 13th September 2017

ముంబై: ఆటో మొబైల్‌ సెక్టార్‌లోని అగ్రగామి వెలుగొందున్న మారుతీసుజుకీ షేరును ఇదే రంగంలోని హీరో మోటోకార్ప్‌ షేరు రాబోయే కాలంలో అధిగమించనుందా..? అవుననే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఇప్పటివరకు మారుతీ సుజుకీ షేరు హీరో మోటోకార్ప్‌ కన్నా మెరుగైన ప్రదర్శన కనబరచింది. గత యేడాది కాలంలో హీరో మోటోకార్ప్‌ షేరు 29శాతం వృద్ది చెందగా, ఇదే సెక్టార్‌లోని మారుతీ సుజుకీ షేరు 49శాతం మాత్రమే వృద్ది చెందింది. గతేడాది కేంద్రప్రభుత్వం

Most from this category