STOCKS

News


మన మార్కెట్లపై శంకర్‌శర్మ విశ్లేషణ

Tuesday 13th March 2018
Markets_main1520942776.png-14627

భారత ఈక్విటీ మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లలో బుల్‌ర్యాలీ ఇంకా ముగిసి పోలేదంటున్నారు ఫస్ట్‌గ్లోబల్‌ సంస్థ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, జాయింట్‌ ఎండీ శంకర్‌శర్మ. ముఖ్యంగా మన మార్కెట్లలో స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ అధిక రాబడులను ఇస్తాయంటున్నారు. 2014 నుంచి సెన్సెక్స్‌ 12.5 శాతం రాబడులు ఇస్తే, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వార్షికంగా 45శాతం రాబడులను అందించిన విషయం గమనార్హం. ఈ తరహా రాబడులు దేశ చరిత్రలో ముందెన్నడూ లేవని, ఇదే ఇక ముందూ కొనసాగుతుందని తాను నమ్ముతున్నట్టు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్‌శర్మ చెప్పారు. 

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌పై స్థూల ఆర్థిక అంశాల ప్రభావం ఎక్కువగా ఉండదని శంకర్‌ శర్మ పేర్కొన్నారు. నిఫ్టీ, సెన్సెక్స్‌ రాబడులు ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే ఈ ఏడాది తక్కువగా ఉండొచ్చన్నారు. అయినా స్మాల్‌ క్యాప్స్‌లో మాత్రం ర్యాలీ ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ ఇప్పటి వరకు 10 శాతం దిద్దుబాటుకు గురికాగా, కొన్ని స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ అయితే రెండంకెల స్థాయిలో నష్టపోయాయి. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లకు మించి మన స్మాల్‌క్యాప్స్‌ పనితీరు ఉంటుంది’’ అని శర్మ చెప్పారు. కమోడిటీ ఆధారిత వర్ధమాన మార్కెట్లు, కమోడిటీయేతర వర్ధమాన మార్కెట్ల కంటే మంచి పనితీరు చూపిస్తాయన్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే కొన్నేళ్లలో చమురు ధరలు 20-50 శాతం వరకు పెరిగినా ఆశ్చర్యం అక్కర్లేదన్నారు. ఇదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 



You may be interested

భారీ నష్టాల పీఎస్‌యూల్లో ఎయిరిండియా, బీఎస్‌ఎన్‌ఎల్‌

Tuesday 13th March 2018

 లాభసాటి సంస్థల్లో ఇండియన్ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా  2016-17లో ప్రభుత్వ రంగ సంస్థలపై అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో ఇండియన్ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా మెరుగైన పనితీరు కనపర్చాయి. అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్ 3 సంస్థలుగా నిల్చాయి. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిరిండియా, ఎంటీఎన్ఎల్ మాత్రం భారీ నష్టాలతో అధ్వాన్న పనితీరు చూపాయి. 2016-17 ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) పనితీరుపై కేంద్రం

రూ.5,000 సిప్‌తో కోటీశ్వరులు!

Tuesday 13th March 2018

ఇటీవలి మార్కెట్లో అస్థిరతలు చూసి ఆందోళన చెందుతున్నారా...? రికార్డు గరిష్టాలకు చేరిన తర్వాత నుంచి సూచీలు కరెక్షన్‌ బాట పట్టాయి. గత రెండు రోజుల్లో మార్కెట్లో కొంత కోలుకున్నాయి. అయినా, ఈ విధమైన ప్రయాణాలు చూసిన తర్వాత సహజంగానే కొత్త ఇన్వెస్టర్లలో ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చి పడుతున్న నిధులతో ఇటీవలి కాలంలో మన మార్కెట్లకు కొంత స్థిరత్వం వచ్చిన మాట నిజమే. ఫిబ్రవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను

Most from this category