STOCKS

News


స్వల్ప లాభంతో ముగింపు..!

Friday 6th April 2018
Markets_main1523010648.png-15254

కీలక స్థాయిలను నిలబెట్టుకున్న సూచీలు
ముంబై:- దేశీ మార్కెట్‌ ఈ వారంతపు రోజైన శుక్రవారం స్వల్ప లాభంతో ముగిసింది. వచ్చే వారం నుంచి కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించారు. ట్రేడింగ్‌ ఆరంభంలో లాభాల స్వీకరణతో సూచీలు నష్టాల్లోకి మళ్లినా, తిరిగి పుంజుకొని చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 33627 వద్ద, నిఫ్టీ 10331 వద్ద ముగిసింది. లోహ, ఐటీ రంగ షేర్లు తప్ప మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లోనే ముగిశాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 24,873 వద్ద ముగిసింది.
మొదట్లో లాభాల్లో స్వీకరణ:-
అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న మళ్లీ వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, గత రెండు రోజుల ర్యాలీ తరువాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండంతో సూచీలు కాసేపు నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఈ దశలోనే సెనెక్స్‌ 33,501, నిఫ్టీ 10,290 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసాయి. 
అదానీ పోర్ట్స్‌, హిందూ పెట్రోనెట్‌, టైటాన్‌, బీపీసీఎల్‌, లుపిన్‌ షేర్లు 1నుంచి 3శాతం లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోల్‌ ఇండియా, వేదాంత, ఇన్ఫోసిస్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 1నుంచి 3శాతం నష్టపోయాయి.You may be interested

మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి అవకాశాలు

Friday 6th April 2018

సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ మిడ్‌క్యాప్‌ విభాగంలో పలు షేర్లు ప్రస్తుత ధరల్లో పెట్టుబడికి మంచి అవకాశంగా కన్పిస్తున్నదని సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ కృష్ణకుమార్‌ చెప్పారు. ఆయన ఆంగ్లచానల్‌తో మాట్లాడుతూ గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల విలువలతో పోలిస్తే పలు మిడ్‌క్యాప్‌ షేర్లు కరెక్షన్‌ తర్వాత ఆకర్షణీయంగా వున్నాయన్నారు. వచ్చే కొద్ది క్వార్టర్లలో కార్పొరేట్‌ ఫలితాలు బావుంటాయని అంచనావేస్తున్నామని, దాంతో ఈ షేర్లు మధ్యకాలికంగా మంచి రాబడిని

10 బెస్ట్‌ మిడ్‌క్యాప్స్‌..!

Friday 6th April 2018

ముంబై: అంతకుముందు వరుసగా ఐదేళ్ల పాటు అవుట్‌పెర్ఫార్మ్‌ చేసిన మిడ్‌క్యాప్స్‌ గడిచిన రెండు నెలల నుంచి స్తబ్ధుగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) అమ్మకాల పరంపర నేపథ్యంలో ఈ రంగ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయని.. పడిపోయినంతమాత్రాన జోష్‌ తగ్గినట్లుకాదని విశ్లేషిస్తున్న మార్కెట్‌ పండితులు చెబుతున్నారు. వాల్యూయేషన్స్‌, ఫండమెండల్స్‌ బాగున్నటువంటి క్వాలిటీ షేర్లలో ర్యాలీ కొనసాగుతూనే ఉంటుందని ఏంజిల్ బ్రోకింగ్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్‌ అమర్జీత్ మౌర్య

Most from this category