STOCKS

News


10500 పాయింట్ల పైన నిఫ్టీ

Monday 16th April 2018
Markets_main1523875242.png-15548

ముంబై:- అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నష్టాలతో మొదలైన మార్కెట్‌ ఫార్మా, ఎఫ్ఎం‌జీసీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్ల ర్యాలీతో క్రమంగా కోలుకుని చివరకు లాభాలతో ముగిసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 34305 వ‌ద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 10528 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఇది మార్కెట్‌కు వరుసగా ఏనిమిదో రోజూ లాభాల ముగింపు. సెన్సెక్స్‌ 33,899 - 34,341 పాయింట్ల శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,396 - 10,540 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ సూచీ 120 పాయింట్ల లాభపడి 25,320 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌ 200 పాయింట్ల నష్టంతో ప్రారంభం:-
సిరియాపై అమెరికా దాడితో అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత శుక్రవారం ముగింపు(34,192)తో పోలిస్తే 248 పాయింట్ల నష్టంతో 33,944 వద్ద, నిఫ్టీ గత ముగింపు(10,480)తో పోలిస్తే 10,398 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
కోలుకున్న సూచీలు:-
కనిష్టస్థాయిలో ప్రారంభమైన నేపథ్యంలో సాంకేతికంగా కొనుగోళ్ల మద్దతు లభించడం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలపై ఇన్వెస్టర్లకు ఆశావహ అంచనాలు ఉండటంతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. ఈ దశలో కేం‍ద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు సూచీలకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఈ మార్చి నెల‌లో టోకు ధ‌ర‌ల ద్రవ్యోల్బణం 2.47 శాతానికి పరిమితమైంది. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో ఈ గణాంకాలు 2.48 శాతంగా నమోదయ్యాయి. దీంతో మిడ్ సెషన్ సమయానికి సూచీలు లాభాల్లోకి చేరుకున్నాయి. మిడ్‌ సెషన్‌ నుంచి సూచీల స్థిరమైన ర్యాలీతో చివరకు మార్కెట్‌ లాభాల్లో ముగిసింది.
ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, హీరోమోటో కార్పోరేషన్‌, గ్రాసిమ్‌, సిప్లా షేర్లు 2నుంచి 5శాతం లాభపడగా, టైటాన్‌, ఎస్‌బీఐ, విప్రో, ఇన్ఫోసిస్‌, టాటామోటర్స్‌ షేర్లు 1నుంచి 5శాతం నష్టాలతో ముగిశాయి.



You may be interested

ఏటీఎంలకు మోదీ పంచ్‌!!

Monday 16th April 2018

 వైట్‌లేబుల్‌ ఆపరేటర్లపై నోట్ల రద్దు ఎఫెక్ట్‌  నగదు లేక పలు కార్యకలాపాల మూత  ఇంటర్‌చేంజ్‌ చార్జీల తగ్గింపుతో పరిస్థితి జఠిలం  ఒక్క సంస్థ కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు  కార్యకలాపాలకు స్వస్తి పలికిన శ్రేయీ ఇన్‌ఫ్రా (సాక్షి, బిజినెస్‌ విభాగం) వైట్‌ లేబుల్‌ ఏటీఎంల (డబ్ల్యూఎల్‌ఏ) గురించి మనకి తెలిసిందే. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆర్‌బీఐ  పలు నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలకు డబ్ల్యూఎల్‌ఏ లైసెన్స్‌లిచ్చింది. కాకపోతే లైసెన్స్‌లిచ్చిన సంస్థలకు ఆ ఏటీఎంలలో పెట్టడానికి క్యాష్‌ మాత్రం

10-12 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌కు అవకాశం..!

Monday 16th April 2018

ముంబై: గతకొన్నేళ్ల నుంచి స్తబ్ధుగా కొనసాగుతూ వచ్చిన ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 2019 ఆర్థిక సంవత్సరంలో రెండెంకలకు చేరనుందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్, ఎకనామిస్ట్ అండ్ స్ట్రాటజిస్ట్ ధనన్జయ్ సిన్హా విశ్లేషించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10-12 శాతం ఉండవచ్చని అంచనాకట్టారు. 2017–18 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి (అక్టోబరు–డిసెంబరు) సంబంధించిన కాలంలో బేస్‌ ఎఫెక్ట్‌ అనుకూలంగా ఉండడం, డిమాండ్‌ రికవరీ సాధించడం, తమ

Most from this category