STOCKS

News


ఆర్థిక సంవత్సరానికి నష్టాలతో వీడ్కోలు

Wednesday 28th March 2018
Markets_main1522232465.png-15007

  • 10150 దిగువకు నిఫ్టీ
  • 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18) ట్రేడింగ్‌ చివరి రోజైన బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది. దీంతో రెండు రోజుల వరుసగా లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 205 పాయింట్లు క్షీణించి 32968 వద్ద, నిప్టీ 70 పాయింట్లు నష్టపోయి 10113 వద్ద ముగిసింది. నేడు మార్చి డెరివేటీవ్‌ కాంట్రాక్ట్స్‌ ముగింపు కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, గత రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో లాభపడుతున్న బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ, ఫిబ్రవరిలో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు, మార్కెట్‌కు వరుస 2రోజుల సెలవు దినాలు, హెవీ వెయిటేజ్‌ షేర్లైన రిలయన్స్‌(2 శాతం), టాటాస్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టాటాస్టీల్‌  షేర్లు 3-1శాతం నష్టపోవడం... మొదలైన అంశాలు నేటి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 33,077.13 - 33,371.04 పాయింట్ల స్థాయిలో ట్రేడ్‌ అయ్యింది. నిప్టీ సూచీ 10,097 - 10,158 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 24,305.80 వద్ద ముగిసింది. ఇక రంగాలపరంగా చూస్తే ఒక్క ఐటీ(0.15శాతం) తప్ప మిగతా అన్ని రంగాల షేర్లూ నష్టాల్లో ముగిశాయి.
నష్టాలతో ప్రారంభం:-
ప్రపంచ మార్కెట్ల నుంచి నెగిటివ్‌ సంకేతాలు, మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ల గడువు నేటితో ముగియున్న నేపథ్యంలో నేడు సూచీల నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 33098 వద్ద, నిఫ్టీ 41పాయింట్ల నష్టంతో 10143 వద్ద ట్రేడింగ్‌ను ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
33వేల దిగువకు సెన్సెక్స్‌:-
ప్రతికూల పరిస్థితులతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో లాభపడుతున్న బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ, ఫిబ్రవరిలో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు మొదలైన అంశాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యతనిచ్చారు. దీంతో సెన్సెక్స్‌ 200 పాయింట్లు కోల్పోయి 33వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 10,096.90 కనిష్ట స్థాయిని తాకింది. 
హీరోమోటార్స్‌, టెక్‌మహేంద్రా, గెయిల్‌, భాష్‌ లిమిటెడ్‌, విప్రో షేర్లు 2నుంచి3శాతం లాభపడగా, రిలయన్స్‌, అదానీ ట్రాన్స్‌పోర్ట్స్‌, వేదాంత లిమిటెడ్‌, టాటాస్టీల్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 2 నుంచి 4శాతం నష్టపోయాయి.



You may be interested

తగ్గినపుడు ఈ రెండు షేర్లూ కొంటాం: ఏంజిల్‌ బ్రోకింగ్‌

Wednesday 28th March 2018

మధ్య, దీర్ఘకాలాలకు తాము కన్జూమర్‌ అప్లయెన్సెస్‌ తయారీ కంపెనీలకు ఇష్టపడుతున్నామని ఏంజిల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూర్‌ జోషి చెప్పారు.  కొన్ని నగర వినియోగ వస్తువుల షేర్లయిన నెస్లే, జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్, టైటాన్‌ వంటివి జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ఉన్నప్పటికీ, వాటి వృద్ధి అవకాశాల దృష్ట్యా తగ్గినపుడు కొనవచ్చని అభిప్రాయపడ్డారు. తాము అయితే బ్లూస్టాక్, కేఈఐ ఇండస్ట్రీస్‌ షేర్లను తగ్గినపుడల్లా కొనుగోలుచేస్తామని చెప్పారు. ఒక ఆంగ్లచానల్‌తో ఆయన మాట్లాడుతూ

నిఫ్టీ 12,000 పాయింట్లకు చేరే అవకాశం: లేడర్‌అప్‌ వెల్త్‌

Wednesday 28th March 2018

ముంబై:  వచ్చే 12 నెలలకాలంలో మార్కెట్‌ ఒడిదుడుకుల మధ్యనే ట్రేడయ్యేందుకు అవకాశం ఉందని.. అయితే, 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి చెందితే నిఫ్టీ 12,000 పాయింట్లను సునాయాసంగా అధిగమించే అవకాశం ఉందని లేడర్‌అప్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ రాఘవేంద్ర నాథ్ అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల వేడి ఉండడం, ట్రేడ్‌ పాలసీలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు, ముడిచమురు ధరల పెరుగుదల, ఉత్తర కొరియా చర్చలు,

Most from this category