STOCKS

News


వారమంతా లాభాలే

Friday 15th March 2019
Markets_main1552646352.png-24631

38000పైన ముగిసిన సెన్సెక్స్‌
11400 పైన ముగిసిన నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కూడా లాభాలతో ముగిసింది. దీంతో సూచీలు ఈ వారమంతా లాభాల బాటలోనే సాగినట్లైంది. సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభంతో 38,024 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,427 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం మొత్తంలో సెన్సెక్స్‌ సూచీ 1352 పాయింట్లను, నిఫ్టీ 391 పాయింట్లను ఆర్జించాయి. విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, రూపాయి వరుసగా ఐదో రోజూ బలపడటం, ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ఎఫ్‌ఎంజీసీ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. డాలర్‌-రూపీ స్వాప్‌ యాక్షన్‌ మార్గంలో మూడేళ్లలో 500 కోట్ల డాలర్ల నిధులను ఆర్‌బీఐ అందించనుండటంతో రుణ వృద్ది మరింతగా మెరుగుపడుతుందనే భావనతో బ్యాంక్‌ షేర్లు రెండో రోజూ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2నెలల గరిష్టాన్ని తాకింది. ఆరు రోజుల వరుస పతనం తరువాత అధిక వాల్యూవేషన్‌ కలిగిన ఐటీ షేర్లు కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో ఇన్వెస్టర్లు ఆ షేర్ల కొనుగోళ్ల మొ‍గ్గుచూపడంతో సూచీలు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ సైతం 2శాతం లాభపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ ఇండెక్స్‌ 144 పాయింట్లు లాభపడి 11,487 వద్ద, సెన్సెక్స్‌ 501 పాయింట్లు పెరిగి 38,255 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే చివరి లాభాల స్వీకరణ కారణంగా సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన మొత్తం లాభాల్లో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. బ్యాంకింగ్‌ రంగంలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 501 పాయింట్లను ఆర్జించిన సెన్సెక్స్‌ చివరి అరగంట విక్రయాలతో 230 పాయింట్లు కోల్పోయిది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ ఇండెక్స్‌ 60 పాయింట్లను నష్టపోయింది. 
విప్రో, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం లాభపడగా, భారతీఎయిర్‌టెల్‌, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యస్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.You may be interested

మిడ్‌క్యాప్‌ ర్యాలీకి రంగం సిద్ధం!?

Saturday 16th March 2019

వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం ఆరంభమైంది. కరెంటు ఖాతా లోటు డిసెంబర్‌ త్రైమాసికానికి ఐదేళ్ల గరిష్ట స్థాయి నుంచి సులభతరం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈ రెండు పరిణామాలు చోటు చేసుకున్న సమయం అనుకూలమని, లార్జ్‌క్యాప్‌ కంటే ఇతర షేర్లు మంచి ప్రదర్శన చూపిస్తాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇటీవలి ఆర్‌బీఐ రేట్ల కోతతో ఇది ఇప్పటికే ఆరంభమైందంటున్నారు. నిఫ్టీ 500 ఇండెక్స్‌ ఫిబ్రవరి 7 నుంచి

బ్యాంకు నిఫ్టీ భారీ ర్యాలీకి కారణాలేంటి?

Friday 15th March 2019

ఫిబ్రవరి వరకు నేల చూపులు చూసిన బ్యాంకు నిఫ్టీ మార్చి ఆరంభం నుంచి జూలు విదిల్చింది. రోజురోజుకు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ కదం తొక్కుతోంది. బ్యాంకు నిఫ్టీ అండతో నిఫ్టీ సైతం ర్యాలీ మూడ్‌లోకి వచ్చింది. మార్చిలో బ్యాంకు నిఫ్టీ ఇంతవరకు దాదాపు 10 శాతం ర్యాలీ జరిపింది. పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ, బీఓబీ, ఆర్‌బీఎల్‌ తదితర పలు బ్యాంకు స్టాకులు 20 శాతం వరకు ర్యాలీ

Most from this category