STOCKS

News


కర్ణాటక పోరు: మార్కెట్‌ బేజారు..!

Wednesday 16th May 2018
Markets_main1526467429.png-16510

10800 దిగువకు నిఫ్టీ
ముంబై:- కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా బుధవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్‌ చివరకు నష్టాలతో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీ, సిప్లా, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లు 4నుంచి1శాతం నష్టపోవడంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35,388 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 10,741 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35241 - 35543 పాయింట్ల శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,699  - 10,790.45 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది.  కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ బ్యాంక్‌ 292 పాయింట్లు నష్టపోయి 26,102 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా రంగ సూచీలు లాభాల్లో ముగియగా, మెటల్‌, ఫైనాన్షియల్‌ సర్వీసు, బ్యాంకింగ్‌, పార్మా రంగ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులమయం:-
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న​ప్రతికూలతలకు తోడు దేశీయంగా కర్ణాటక రాజకీయాల అనిశ్చితి నేపథ్యంలో నేడు మార్కెట్‌  నష్టాలతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్లు నష్టపోయి 35452 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 10,752 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది.
 గెయిల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సిప్లా, ఐసీఐసీఐ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌,  ఐటీసీ, లుపిన్‌, హిందూస్తాన్‌ యూనీలివర్‌ షేర్లు 2నుంచి 4శాతం వరకూ లాభపడ్డాయి.



You may be interested

మార్కెట్లు తగ్గితే కొనడం... అదే మేం సూచించేది: క్వాంటం

Wednesday 16th May 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత మూడు నెలలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక అంశం మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టినా, అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో మన మార్కెట్ల గమనంపై క్వాంటం గ్రూపు వ్యవస్థాపకుడు సందీప్‌ టాండన్‌ తన అభిప్రాయాలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.  మార్కెట్లపై కర్ణాటక ఫలితాల

మోడీ ఫ్యాక్టర్‌ కొనసాగుతోంది: యూబీఎస్‌

Wednesday 16th May 2018

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోనికి వస్తుందా? లేదా అనే అంశం దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకంగానే ఉందని యూబీఎస్‌ ఇండియా రిసెర్చ్ హెడ్‌ గౌతం చౌచారియా అన్నారు. వచ్చే 12 నెలలకాలంలో మల్టీపుల్స్‌కు కూడా ఇదే అంశం చోదక శక్తిగా కనబడతుందని విశ్లేషించారు. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. కర్ణాటక ఎన్నికల అంశాన్ని మార్కెట్‌ డిస్కౌంట్‌ చేస్తుందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్,

Most from this category