STOCKS

News


సగం మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలకు మంగళం

Wednesday 13th September 2017
personal-finance_main1505243819.png-8473

మన దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ఇటీవల భారీగా వర్ధిల్లుతోంది. మొత్తం 42 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు) ఉండగా... ఇవన్నీ కలసి 2,000కుపైగా వివిధ రకాల పేర్లతో పెట్టుబడులను నిర్వహిస్తున్నాయి. వీటి పెట్టుబడుల విలువ రూ.20.6లక్షల కోట్లకు చేరింది. ఇన్ని వేల పథకాలు రాబడులను  ఇన్వెస్టర్లు అర్థం చేసుకుని సరైన పథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది ఎంతో కష్టం. అందుకే ఈ గందరగోళానికి తెరదించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అడ్వైజరీ ప్యానల్‌ ఈ దిశగా పలు సూచనలు చేసింది. దీంతో సగం పథకాలు కనుమరుగు కానున్నాయి. 

సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అడ్వైజరీ సిఫారసుల ప్రకారం... ఫండ్స్‌ను ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌, థీమాటిక్‌ అనే కేటగిరీలుగానే విభజించాలి. ఈక్విటీలో అయితే లార్జ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ అంటూ ఉప విభాగాలు ఉండొచ్చు. లార్జ్‌ క్యాప్‌ పేరుతో ఒకటికి మించి పథకాలు ఉండడానికి ఇకపై వీలు కాకపోవచ్చు. అందులోనూ లార్జ్‌క్యాప్‌ పేరుంటే మొత్తం నిధుల్లో 80 శాతం లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఫథకాన్ని ఎత్తేయాల్సి ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాల సమాచారం. ఈ నెల 18న జరిగే బోర్డు సమావేశంలో సెబీ ఈ సిఫారసులపై చర్చించి వాటిని నోటిఫై చేయనున్నట్టు తెలుస్తోంది.

కొన్ని సంస్థలు ఒకటికి మించిన ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీములను, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ ను నిర్వహిస్తుండగా, ఇకపై ఇవి ఒక్కటిగా మారిపోవాల్సిందే. ‘‘చాలా కేసుల్లో ఈ తరహా పథకాల పెట్టుబడి విధానం ఒకటే. కేవలం పేరులోనే తేడా. దీంతో కస్టమర్లకు అయోమయం ఏర్పడుతోంది’’ అని ముంబైకి చెందిన అవుట్‌లుక్‌ ఏసియా క్యాపిటల్‌ సీఈవో మనోజ్‌నాగ్‌పాల్‌ పేర్కొన్నారు. అయితే, తాజా ప్రతిపాదనల నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఒకే తరహా పథకాల విలీనంపై దృష్టి సారించాయి. సెబీ నుంచి నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చని, కనుక తాము పథకాల విలీనంపై కసరత్తును మొదలు పెట్టినట్టు ఓ టాప్‌ ఫండ్‌ మేనేజర్‌ వెల్లడించడం విశేషం. అయితే, రెండు పెద్ద పథకాలను విలీనం చేయడమన్నది సవాలేనన్నారు. మరోవైపు విలీనాలకు పన్ను పరంగా వెలుసులుబాటు కూడా ఉంది. 2017 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో కేంద్రం మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల విలీనాలను మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కల్పించింది. ఇలా విలీనం తర్వాత ఏదేనీ ఇన్వెస్టర్‌ తన పెట్టుబడులను విక్రయించేస్తే, తాను విలీనానికి ముందు పెట్టుబడులు పెట్టిన తేదీని పన్ను లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకుంటారు. You may be interested

10,100 పాయింట్ల ఎగువన నిఫ్టీ

Wednesday 13th September 2017

ముంబై: ఆర్థిక గణాంకాలు నిరుత్సాహ పరచడంతో దేశీయ స్టాక్‌ సూచీలు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో కొద్దిసేపు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ 9 గంటల 30 నిమిషాల సమయానికి మళ్లీ లాభాలబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాల నేపథ్యంలో నిఫ్టీ మరో కీలక స్థాయి ఎగువకు చేరింది. ఇదే సమయానికి 12 పాయింట్ల లాభంతో 10,105 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 52 పాయింట్ల లాభంతో 32,207 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ ఇండీసెస్‌లో

లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టింగ్‌ అంటే ఎంత కాలం...?

Wednesday 13th September 2017

ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసే వారు భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చన్న విశ్లేషణలు తరచూ ఇన్వెస్టర్ల చెవిన పడుతూనే ఉంటాయి. కానీ, దీర్ఘకాలం పాటు అంతే ఎంత కాలం... ఎన్నేళ్లు? అన్న సందేహం తరచుగా ఎదురవుతుంటుంది. దీనికి ప్రముఖ ఆర్థిక నిపుణులు, వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ ఇలా వివరించారు.  కొన్నేళ్ల క్రితం అమెరికాలో ఫిడెలిటీ సంస్థ ఏ తరహా ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలు వస్తున్నాయనే విషయమై

Most from this category