News


షెఫ్లర్‌​ ఇండియాకు విలీన వెలుగులు....

Thursday 31st August 2017
Markets_main1504162662.png-7803

స్టాక్‌ సూచీలు ఒడిదుడుకుల మధ్య  ట్రేడవుతున్నా, షెఫ్లర్‌ ఇండియా (గతంలో ఫాగ్‌ బేరింగ్స్‌)  షేర్‌ మాత్రం లాభాల్లో సాగుతోంది. కంపెనీ అనుబంధ కంపెనీలు.. ఐఎన్‌ఏ బేరింగ్స్‌, లక్‌ ఇండియాలను విలీనం చేసుకుంటున్నామని షెఫ్లర్‌ ఇండియా ప్రకటించించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఈ షేర్‌ గురువారం ఇంట్రాడేలో 17 శాతం వరకూ దూసుకెళ్లి రూ.4,981ను తాకింది. విలీనంలో భాగంగా  ప్రతి 65 ఐఎన్‌ఏ బేరింగ్స్‌ కంపెనీ షేర్లకు 10 ఈక్విటీ షేర్లను అలాగే​ప్రతి 35 లక్‌ ఇండియా షేర్లకు 10 ఈక్విటీ షేర్లు చొప్పున జారీ చేస్తామని షెప్లర్‌ ఇండియా తెలిపింది. ఈ విలీన వార్తల నేపధ్యంలో ఈ షేర్‌ దూసుకుపోతోంది. బుధవారం రూ.4,263 వద్ద ముగిసిన ఈ షేర్‌ గురువారం ఇంట్రాడేలో రూ.4,719, రూ.5,115 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. బీఎస్‌ఈలో గం.12.52 ని. సమయానికి ఈ షేర్‌ 15 శాతం లాభంతో రూ.4,912 వద్ద ట్రేడవుతోంది.  కాగా కంపెనీ షేరు ధర ఏడాది కనిష్ట స్థాయి రూ.3780 , ఏడాది గరిష్ట స్థాయి రూ.  5149 గా నమోదయ్యాయి. 

 







You may be interested

​​​​​​​ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌కు ‘సుప్రీమ్‌’ షాక్‌...

Thursday 31st August 2017

ముంబై:- మెడికల్‌ సర్వీసు సేవలు అందించే ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌కు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు షాక్‌నిచ్చింది. గతంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ప్రమోటర్లు ఐన మల్వీందర్‌ సింగ్‌, శివీందర్‌ సింగ్‌లు బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల వద్ద కొంత వాటా షేర్లను తనఖా పెట్టారు. ఈ తనఖా షేర్లను విక్రయించేందుకు అనుమతిని ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు సింగ్‌ బ్రదర్స్‌ తనఖాకు ఉంచిన

జియోజిత్‌ హాట్‌ పిక్స్‌ ఇవే....

Thursday 31st August 2017

జియోజిత్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆణిముత్యాల్లాంటి 3 షేర్లను సిఫార్సు చేస్తోంది. అవేంటంటే..   ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌ ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.206 టార్గెట్‌ ధర రూ.227 నవరత్న సంస్థలలో ఒకటైన ఎన్‌బీసీసీ....ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్‌, నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బలమైన ముద్రవేసింది. ప్రస్తుతం రూ.75,000 కోట్ల ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉండగా, ఇవి 2017 అమ్మకాలతో పోల్చితే 12 రెట్లు అధికం కావడం విశేషం. 2018 ఆర్డర్ల అంచనా రూ.25,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా.  ప్రస్తుత

Most from this category