STOCKS

News


నెలలో రూ.1,000 కోట్లు డిపాజిట్‌ చేయండి

Wednesday 16th May 2018
news_main1526489481.png-16529

  • జైప్రకాష్‌ అసోసియేట్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లింపులు చేసేందుకు గాను జూన్‌ 15 నాటికి మరో రూ.1,000 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు జైప్రకాష్‌ అసోసియేట్స్‌ను ఆదేశించింది. ఈ మేరకు డిపాజిట్‌ చేస్తే అనుబంధ సంస్థ జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌ (అమ్మకం) ప్రక్రియపై స్టే కొనసాగుతుందని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకవేళ గడువు నాటికి చెప్పిన మేర డిపాజిట్‌ చేయడంలో విఫలమైతే దివాలా చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద రూ.2,000 కోట్లను డిపాజిట్‌ చేయాలని కోర్టు గతంలోనే జైప్రకాష్‌ అసోసియేట్స్‌ను ఆదేశించగా, సదరు సంస్థ ఇప్పటి వరకు కేవలం రూ.750 కోట్లను మాత్రమే డిపాజిట్‌ చేసింది. జైప్రకాష్‌ అసోసియేట్స్‌ తరఫున న్యాయవాది అనుపమ్‌లాల్‌ దాస్‌ హాజరై జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ పునరుద్ధరణ ప్రణాళికను తాజాగా పరిగణించాలని కోరారు. ‘‘మెరుగైన పునరుద్ధరణ ప్రణాళికను ప్రతిపాదించాం. జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిక్విడేషన్‌ వల్ల అటు రుణదాతలకు, ఇటు గృహ కొనుగోలుదారులకు మంచిది కాదు’’ అని కోర్టుకు తెలియజేశారు. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా ప్రతీ కొనుగోలుదారుడికి జైపీ ఇన్‌ఫ్రా 2,000 షేర్లను ఇస్తామని కంపెనీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 



You may be interested

జ్యోతి ల్యాబ్స్‌ 1:1 బోనస్‌

Wednesday 16th May 2018

ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌ 29 శాతం తగ్గిన నికర లాభం  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌లో 29 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.107 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.76 కోట్లకు తగ్గిందని జ్యోతి ల్యాబ్స్‌ తెలిపింది. తమ కంపెనీలో విలీనమైన హెంకెల్‌ మార్కెటింగ్‌

హిందాల్కో లాభం రూ.377 కోట్లు

Wednesday 16th May 2018

25 శాతం డౌన్‌ రికార్డ్‌ స్థాయి రాగి ఉత్పత్తి  న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.377 కోట్ల నికర లాభం(స్డాండ్‌ ఎలోన్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016-17) క్యూ4లో వచ్చిన నికర లాభం, రూ.503 కోట్లతో పోల్చితే 25 శాతం క్షీణించిందని హిందాల్కో వివరించింది. మొత్తం ఆదాయం కూడా రూ.11,970 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు తగ్గిందని

Most from this category