STOCKS

News


ఎస్‌బీఐ కనీస బ్యాలెన్స్ చార్జీల తగ్గింపు

Tuesday 13th March 2018
news_main1520960952.png-14640

  •  75 శాతం మేర తగ్గుదల
  •  ఇకపై నగరాల్లో నెలకు రూ. 15, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10
  •  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

ముంబై: ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కనీస బ్యాలెన్స్ పెనాల్టీ చార్జీలను 75 శాతం మేర తగ్గించింది. దీంతో ఇకపై నగరాల్లో నెలకు సగటు బ్యాలెన్స్ పరిమితులను పాటించని పక్షంలో రూ. 15 (పన్నులు అదనం), సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ. 12, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ. 10 విధించనుంది. ప్రస్తుతం మెట్రోలు, అర్బన్ ప్రాంతాల్లో ఈ చార్జీలు గరిష్టంగా నెలకు రూ. 50 (పన్నులు అదనం), సెమీ అర్బన్‌.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40గా ఉన్నాయి. కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, పెనాల్టీ చార్జీలను తగ్గించినప్పటికీ కనీస బ్యాలెన్స్ పరిమితులను మాత్రం ఎస్‌బీఐ యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం ఇకపై కూడా మెట్రో నగరాల్లో కనీస నెలవారీ బ్యాలెన్స్ పరిమితి రూ. 3,000 గాను, సెమీ అర్బన్ ఖాతాల్లో రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల ఖాతాల్లో రూ. 1,000గాను కొనసాగతుంది. కనీస బ్యాలెన్స్ నిబంధనలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పెనాల్టీ చార్జీలు విధిస్తూ.. భారీ లాభాలు గడిస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 
    పెనాల్టీ చార్జీల తగ్గింపుతో బ్యాంకు ఫీజు ఆదాయం కొంత మేర తగ్గనుంది. "ఖాతాదారుల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం చార్జీలను తగ్గించడం జరిగింది. కస్టమర్స్‌ ప్రయోజనాలే మా ప్రధాన లక్ష్యం" అని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) పి.కె. గుప్తా తెలిపారు. దాదాపు అయిదేళ్ల విరామం అనంతరం గతేడాది ఏప్రిల్‌లో కనీస నెలవారీ బ్యాలెన్స్ చార్జీలను మళ్లీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అక్టోబర్‌లో వీటిని కొంత మేర సవరించింది. ఈలోగా ఏప్రిల్‌-నవంబర్ వ్యవధిలో ప్రధానంగా ఇలాంటి చార్జీల ద్వారానే ఎస్‌బీఐ ఏకంగా రూ. 1,772 కోట్లు ఆర్జించినట్లు ఆర్థిక శాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇది బ్యాంకు రెండో త్రైమాసికం లాభం కన్నా అధికం కావడం గమనార్హం. దీనిపై సర్వత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా చర్య తీసుకుంది. ఎస్‌బీఐకి 41 కోట్ల పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటిలో 16 కోట్ల ఖాతాలు ప్రధానమంత్రి జన ధన యోజన/ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్‌, పింఛనర్లు మొదలైన వర్గాలకు చెందినవి. వీటిపై కనీస బ్యాలెన్స్ చార్జీలు లేవు. దీంతో ప్రస్తుత సవరణతో దాదాపు 25 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. కనీస బ్యాలెన్స్ చార్జీల బాదరబందీ లేకుండా సేవింగ్స్ ఖాతా నుంచి కావాలంటే ప్రాథమిక సేవింగ్స్ ఖాతా (బీఎస్‌బీడీ)కి కూడా బదలాయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గుప్తా వివరించారు. You may be interested

2025 కల్లా ప్రతి ఐదు లావాదేవీల్లో నాలుగు డిజిటలే!!

Tuesday 13th March 2018

ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్స్‌యాక్ట్‌ నివేదికలో వెల్లడి  న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్ల విలువ 2025 కల్లా ఏడాదికి లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్స్‌యాక్ట్‌ టెక్నాలజీస్‌ సంయుక్త నివేదిక పేర్కొంది. ప్రతి ఐదు లావాదేవీల్లో నాలుగు డిజిటల్‌ రూపంలో ఉంటాయని తెలిపింది. ప్రసుత్తం ఇండియాలో డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్లు

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీలో 4 శాతం వాటా విక్రయం

Tuesday 13th March 2018

ఐపీఓ ద్వారా విక్రయించనున్న హెచ్‌డీఎఫ్‌సీ  న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎమ్‌సీ)లో 4 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా విక్రయించనున్నది. హెచ్‌డీఎఫ్‌సీ డైరెక్టర్ల బోర్డ్‌ నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈ వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఒక్కొక్కటి రూ.5 విలువ గల 4.08 శాతం వాటాకు సమానమైన 85,92,970 షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనున్నామని పేర్కొంది.  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఐపీఓకు గత ఏడాది

Most from this category