STOCKS

News


ఐపీఓకు ఎస్‌బీఐ లైఫ్‌ దరఖాస్తు

Tuesday 18th July 2017
Markets_main1500319275.png-5524

  • రూ.6,500-రూ.7,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదన

ముంబై: జీవిత బీమా రంగంలోని ప్రముఖ కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.6,500-7,000 కోట్లను సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 12 కోట్ల షేర్లను ఐపీవోలో భాగంగా ప్రమోటర్లు విక్రయించనున్నారు. మొత్తం జారీ మూలధనంలో 12 శాతానికి సమానం. ఎస్‌బీఐ 8 కోట్ల షేర్లు, బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ ఎస్‌ఏ 4 కోట్ల షేర్లను జారీ చేస్తాయి. ఈ రెండు సంస్థలు ఎస్‌బీఐ ప్రమోటర్లుగా ఉన్నాయి. 20 లక్షల షేర్లను ఎస్‌బీఐ ఉద్యోగులకు, 1.2 కోట్ల షేర్లను ఎస్‌బీఐ వాటాదారులకు రిజర్వ్‌ చేస్తారు. జేఎం ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బీఎన్‌పీ పరిబాస్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, డూచె సెక్యూరిటీస్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, కోటక్‌ మహింద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా సేవలు అందించనున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ తర్వాత ఐపీవోకి రానున్న రెండో బీమా కంపెనీ ఇది. You may be interested

జుబిలెంట్‌కు కలిసొచ్చిన క్యూ1

Tuesday 18th July 2017

లాభం 25 శాతం వృద్ధితో రూ.24 కోట్లకు న్యూఢిల్లీ: డోమినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ పేరుతో రిటైల్‌స్టోర్స్‌ను నిర్వహిస్తున్న జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ జూన్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత స్టోర్స్‌ విక్రయాలు పుంజుకోవడంతో కంపెనీ లాభం రూ.24 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.19 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరుగుదలతో రూ.612

వృద్ధిపై ఆశావహంగా భారతీయ సీఈవోలు

Tuesday 18th July 2017

 కేపీఎంజీ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఎకానమీతో పోలిస్తే వచ్చే మూడేళ్ల కాలంలో దేశ ఆర్థిక వృద్ధి బాగుంటుందన్న అంచనాలపై భారతీయ సీఈవోలు విశ్వాసంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న సగానికి పైగా సీఈవోలు వచ్చే మూడేళ్ల కాలంలో వారి కంపెనీలు పూర్తిగా మార్పు చెందుతాయని ధీమా వ్యక్తంచేశారు. కంపెనీల వృద్ధిని ప్రభావితం చేసే అంశాల్లో టెక్నాలజీ అగ్రస్థానంలో ఉంటుందని కూడా తెలియజేశారు. ఈ విషయాలు కేపీఎంజీ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యాయి.

Most from this category