STOCKS

News


ఎస్‌బీఐలో 41.2 లక్షల ఖాతాలు క్లోజ్‌

Tuesday 13th March 2018
news_main1520961797.png-14645

  • కనీస నిల్వ లేకపోవడం వల్లేనని బ్యాంకు వెల్లడి

ఇండోర్‌: ప్రభుత్వరంగ ఎస్‌బీఐ కనీస నిల్వలేమి కారణంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా 41.2 లక్షల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలను మూసేసింది. కనీస బ్యాలన్స్‌ల నిర్వహణలో విఫలమైతే చార్జీల విధింపును గతేడాది ఏప్రిల్‌ నుంచి బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం జరిగిన విషయం గమనార్హం. కనీస నిల్వ లేని కారణంగా వాటికి నిధులు కేటాయింపులు చేయాల్సి ఉండడంతో 41.16 లక్షల ఖాతాలను మూసేసినట్టు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఎస్‌బీఐ సమాధానం ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ ఈ దరఖాస్తు చేశారు. స్‌బీఐలో మొత్తం 41 కోట్ల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో జన్‌ధన్‌ యోజన, బేసిక్‌ సేవింగ్‌ ఖాతాలు, పెన్షనర్లు, మైనర్‌ పేరిట ఉన్న మొత్తం 16 కోట్ల ఖాతాలకు కనీస బ్యాలన్స్‌ నుంచి మినహాయింపు ఉంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్రిప్టోకరెన్సీ సేవలు బంద్‌

Tuesday 13th March 2018

ముంబై: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమరా? అయితే ఇక మీరు మీ బ్యాంక్‌ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలు నిర్వహించడం వీలుపడదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజాగా తన క్రెడిట్‌, డెబిట్‌, ప్రిపెయిడ్‌ కార్డులపై క్రిప్టోకరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ సర్వీసులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిప్టోకరెన్సీలపై అంతర్జాతీయంగా భయాలు పెరుగుతోన్న నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా

టీసీఎస్‌ షేర్లు విక్రయించిన టాటా సన్స్‌

Tuesday 13th March 2018

3.12 కోట్ల షేర్ల అమ్మకం విక్రయ విలువ రూ.9,000 కోట్లు !  న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)లో 1.63 శాతానికి సమానమైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ టాటా సన్స్‌ విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఈ షేర్ల విక్రయం జరిగింది.  ఈ షేర్ల విక్రయ విలువ దాదాపు రూ.9,000 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్‌ డేటా ప్రకారం 2.06 కోట్ల షేర్లను రూ.2,876 ధరకు, 1.06 కోట్ల షేర్లను రూ.2,872 ధరకు విక్రయించారు. మొత్తం

Most from this category