News


సత్యం వ్యవహారం... పీడబ్య్లూసీపై త్వరలో సెబీ ఉత్తర్వులు!

Tuesday 18th July 2017
news_main1500320938.png-5533

న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం నాటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటింగ్ అవకతవకలకు సంబంధించి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌పై (పీడ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తుది ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి 2008 దాకా పీడబ్ల్యూసీ.. సత్యం కంప్యూటర్స్‌కి ఆడిటింగ్ సేవలు అందించింది. సత్యం కంప్యూటర్స్ అనేక సంవత్సరాల పాటు తమ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణం 2009 జనవరిలో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో పీడబ్ల్యూసీకి సెబీ షోకాజ్ నోటీసులిచ్చింది. తాము సెబీ పరిధిలోకి రామంటూ పీడబ్ల్యూసీ .. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పీడబ్ల్యూసీ నిర్ధారించిన బ్యాలెన్స్ షీట్ల ఆధారంగానే సత్యం కంప్యూటర్స్‌లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు.. దాని వైఖరి కారణంగా నష్టపోయారంటూ సెబీ వాదించింది. ఫలితంగా షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సెబీకి పూర్తి అధికారాలు ఉంటాయంటూ న్యాయస్థానం పేర్కొంది. అప్పట్నుంచీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆరునెలల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించడంతో సెబీ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. మే-జూన్‌లో పీడబ్ల్యూసీ వర్గాలను పలు దఫాలుగా విచారించింది. అటు ప్రభుత్వం నుంచి కూడా సెబీకి పీడబ్ల్యూసీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిశీలించాలని కేంద్రం సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 







You may be interested

క్యూ2లో చైనా వృద్ధి 6.9%

Tuesday 18th July 2017

 6.5 శాతం లక్ష్యం కన్నా అధికం బీజింగ్‌: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇది ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకున్న 6.5 శాతం కన్నా అధికం. ఈ నేపథ్యంలో అధిక రుణభారం ఉన్నప్పటికీ.. 2017 వృద్ధి లక్ష్యాలను చైనా సునాయాసంగా అధిగమించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు తొలి త్రైమాసికం స్థాయిలోనే రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. తమ

ఎన్‌పీఏలపై ఆర్‌బీఐకి వారం గడువు

Tuesday 18th July 2017

నిపుణుల నివేదికపై స్పందన తెలియజేయాలన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి చర్యల్ని సూచిస్తూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరడంతో వీటి పరిష్కారంపై చర్యల్ని సూచించేందుకు గాను ఆర్‌బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ‍కమిటీ 12 బడా రుణ ఎగవేత

Most from this category