STOCKS

News


అల్యూమినియం ధరలకు రెక్కలు!

Saturday 14th April 2018
Markets_main1523687360.png-15509

గోల్డ్‌మన్‌ సాచె అంచనా
రష్యా కంపెనీలపై అమెరికా ఆంక్షలతో అల్యూమినియం ధరలకు రెక్కలు వస్తాయని, జూన్‌ వరకు అల్యూమినియం ధరల్లో ఒడిదుడుకులుంటాయని అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్‌మన్‌ సాచె అంచనా వేసింది. మధ్యాసియా సంక్షోభ కారణంగా క్రూడాయిల్‌ ధర 72 డాలర్లను తాకవచ్చని అభిప్రాయపడింది. కమొడిటీలపై ఓవర్‌వెయిట్‌ ధృక్పథాన్ని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే 12 నెలల్లో కమొడిటీలు 10 శాతం వరకు రాబడినిస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల్లో కమోడిటీలపై పెట్టుబడి పెట్టడం లాభదాయకమని పేర్కొంది. యూఎస్‌ తాజా ఆంక్షల ప్రభావం చమురు మార్కెట్‌పై నేరుగా ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. అల్యూమినియంపై మాత్రం నేరుగా ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా వ్యాపార దిగ్గజం ఒలెగ్‌డెరిపస్కాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. డెరిపస్కా చేతిలో ప్రపంచంలో రెండో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు రసల్‌ పగ్గాలున్నాయి. అందుకే అమెరికా ఆయనపై, ఆయన వ్యాపారాలపై ఆంక్షలు విధించింది. మరోవైపు ఇరాన్‌పై మరోమారు ఆంక్షలు విధించే అవకాశాలున్నా.. అవి చమురు మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఇరాన్‌ ఎగుమతులపై మాత్రం ప్రభావం ఉండొచ్చని తెలిపింది. అంతర్జాతీయంగా చమురు మార్కెట్‌కు గడ్డుపరిస్థితులు కొనసాగుతాయని, సిరియా, యెమెన్‌, ఇరాన్‌ సంక్షోభాలు ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఇటీవల కాలంలో ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.



You may be interested

తగ్గిన మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు

Saturday 14th April 2018

ముంబై:- మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఈ మార్చిలో గణనీయంగా తగ్గాయి. ఏయూఎం ఆస్తుల మొత్తం విలువ ఈ మార్చి నెలలో 3.78శాతం క్షీణించి రూ.21.36 లక్షల కోట్లకు పరిమితమైంది. అంతకు ముందు నెల ఫిబ్రవరిలో ఈ ఆస్తుల విలువ రూ.22.20 లక్షల కోట్లుగా నమోదైంది. మార్చిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు  3శాతం మేర నష్టపోవడం, మనీ మార్కెట్‌ విభాగాల నుంచి ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండటం ఏయూఎం ఆస్తుల

నిఫ్టీ తర్వాత టార్గెట్‌ 10600?!

Saturday 14th April 2018

నిపుణుల అంచనా నిఫ్టీ డైలీ చార్టుల్లో డోజీ క్యాండిల్‌, వారం చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరుస్తూ వారాన్ని ముగించింది. కీలకమైన 10350 పాయింట్లపైన ముగియడంతో సూచీలో బలహీనత తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇదే తరహా బలం చూపితే త్వరలో నిఫ్టీ 10600 పాయింట్ల వరకు ఎగబాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారాంతంలో బుల్స్‌కు బలం తగ్గడంతో చివరి సెషన్‌లో డోజీ క్యాండిల్‌ ఏర్పడిందని చార్ట్‌వ్యూ ఇండియా ప్రతినిధి మజార్‌ మొహమద్‌

Most from this category