రూపాయికి సిరియా సెగ

- 10 గంటల సమయానికి 65.39 వద్ద ట్రేడింగ్
భూగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఉదయం నష్టాలతో మొదలయ్యింది. ఫారెక్స్ మార్కెట్లో 9 గంటల 15 నిమిషాల సమయానికి రూపాయి విలువ 20 పైసలు కోల్పోయి 65.38 దగ్గర ప్రారంభమయ్యింది. శుక్రవారం ముగింపు 65.22 కాగా, ఈస్థాయి నుంచి 0.26 శాతం నష్టపోయి ట్రేడింగ్ ప్రారంభించింది. భారత కరెన్సీని పొటెన్షియల్ కరెన్సీ మ్యానిపులేటర్స్ జాబితాలోకి చేరుస్తున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించడం కూడా రూపాయి విలువపై ఒత్తిడి పెంచినట్లు ఫారెక్స్ మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఈ చర్య కారణంగా భారత అధికారులు రూపాయి పెరుగుదల సమయంలో నిర్ణయాలను తీసుకునేటప్పుడు కాస్త వెనకడుగుడు వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నోమురా వివరించింది. ఈ అంశాలకు తోడు దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో ప్రారంభంకావడం కూడా రూపాయి విలువను కుంగదీశాయని ఫారెక్స్ నిపుణులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ 2.3 శాతం పతనమయ్యింది.
మధ్యాహ్నం 12.30 సమయానికి టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) వెల్లడికానుండగా.. మార్చి నెలకు ఇది 2.47 శాతం ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 7.413 శాతంగా ఉంది. అంతక్రితం ముగింపు 7.425 శాతంగా నమోదయ్యింది.
అమెరికా కరెన్సీ బలానికి కొలమానంగా ఉన్న డాలర్ ఇండెక్స్ క్రితం ముగింపు 89.80 కాగా, 0.09 శాతం నష్టపోయి 89.723 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
You may be interested
బ్రోకరేజ్‌ల టాప్ టెన్ సిఫార్సులు..
Monday 16th April 2018స్వల్పకాలంలో మంచి రాబడులు ఇచ్చే పది స్టాక్ ఐడియాలను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి.. ఏంజల్ బ్రోకింగ్ రికమండేషన్స్ 1. గ్లెన్‌మార్క్ ఫార్మా: కొనొచ్చు. టార్గెట్ రూ. 621. స్టాప్‌లాస్ రూ. 555. రెండేళ్లుగా నేలచూపులు చూస్తోంది. ఈ సుదీర్ఘ కరెక్షన్ రూ. 500 స్థాయిల వద్ద ముగింపునకు వచ్చింది. ఈ స్థాయి వద్ద ఆరేడువారాలుగా బలమైన మద్దతు కూడగట్టుకోంది. ఇటీవలే కన్సాలిడేషన్ జోన్ నుంచి బయటకు వచ్చింది. వాల్యూంలు కూడా
సోమవారం వార్తల్లోని షేర్లు
Monday 16th April 2018ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్లు ఇవీ..! అరబిందో ఫార్మా:- అలర్జీ నివారణ చికిత్సలో ఉపయోగించే లారాటాడిన్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. స్రైడ్స్ షాసున్:- సైప్రోహెప్టడైన్ హైడ్రోక్లోరైడ్ ఔషధాలకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. ఐసీఐసీఐ:- కంపెనీ కార్పోరేట్ వ్యవహారాలపై సెబీ జరుపుతున్న దర్యాప్తు విషయాన్ని బీఎస్ఈ వివరణ కోరింది. యూనిటైడ్ స్పిరిట్:- షేర్లను 1:5 నిష్పత్తిలో విభజించనుంది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ షేర్ల విభజన ప్రతిపాదనకు