STOCKS

News


4 పైసలు నష్టపోయిన రూపాయి

Tuesday 20th March 2018
Markets_main1521520586.png-14809

  • 10 గంటల సమయానికి 65.20 వద్ద ట్రేడింగ్‌

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఉదయం నష్టాలతో మొదలయ్యింది. 4 నెలల కనిష్టస్థాయికి పతనమయ్యింది. ఉదయం 4 పైసలు బలహీనపడి 65.21 దగ్గర ప్రారంభమయ్యింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఉదయం నష్టాలతో ప్రారంభంకావడం.. అంతర్జాతీయ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలరు విలువ ఇతర దేశాల కరెన్సీలముందు బలపడడమే ఇందుకు ప్రధానకారణాలుగా నిలిచాయని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. 

డిసెంబర్‌ క్వార్టర్‌ కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో 2 శాతానికి చేరుకున్న కారణంగా సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ ఏకంగా 23 బలహీనపడి 65.17 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.



You may be interested

నిఫ్టీకి 10225 వద్ద నిరోధం!

Tuesday 20th March 2018

సాంక్టమ్‌ వెల్త్‌ అంచనా జాతీయ, అంతర్జాతీయ కారణాలతో మార్కెట్లు ఈ వారం నెగిటివ్‌గా ఆరంభం అయ్యాయి. సోమవారం నిఫ్టీ దాదాపు ఒక శాతం పతనమై 10100 పాయింట్ల దిగువకు వచ్చింది. చాలా రోజుల తర్వాత నిఫ్టీ 200 రోజుల డీఎంఏ స్థాయి కింద క్లోజయింది. దీంతో పాటు దీర్ఘకాల ఊర్ధ్వముఖ మద్దతు వాలు రేఖను సైతం కిందవైపుగా ఖండిస్తూ క్లోజయింది. ఈ నేపథ్యంలో సూచీల్లో నెగిటివ్‌నెస్‌ మరికొంతకాలం కొనసాగుతుందని అంచనా. ఆప్షన్‌

కనిష్టస్థాయి నుంచి పెరిగిన పుత్తడి 

Tuesday 20th March 2018

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరో రోజులో పాలసీ నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో పుత్తడి ధర కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యింది. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు భయాలతో గత రాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్‌ పతనమైన సందర్భంలో నైమెక్స్‌ ఔన్సు బంగారం ధర సైతం అంతర్జాతీయ మార్కెట్లో 1,308 డాలర్ల వద్దకు పతనమయ్యింది. అయితే ఈ లోహానికి ఆ స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నాటకీయంగా

Most from this category